జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తి కల్పించే అధికరణ-370 రద్దు అనంతరం.. భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో తాజాగా కశ్మీర్ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్.
తమ తదుపరి అజెండా పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగిపొందడమేనని అన్నారు. ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ విధంగా మాట్లాడారు.
'పీఓకేను తిరిగిపొందడమే మా తదుపరి అజెండా'
''మా తదుపరి అజెండా పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగిపొందడమే. దీనిని తిరిగి భారత్‌లో అంతర్భాగం చేయాలి. ఇది కేవలం నా, మా పార్టీ నిబద్ధతే కాదు. కానీ.. 1994లో ప్రధాని నర్సింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో పార్లమెంటు ఏకగ్రీవంగా ఆమోదించిన తీర్మానంలో ఓ భాగం. ''
- జితేంద్ర సింగ్, కేంద్ర మంత్రి