న్యాయవ్యవస్థలో నెలకొన్న ఖాళీలపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. న్యాయశాఖలో భారీ స్థాయిలో ఉన్న ఖాళీలను భర్తీ చేయటమే అత్యంత ముఖ్యమైన పని అని వ్యాఖ్యానించింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు.. అందులోని 24 హైకోర్టుల ప్రగతిపై అత్యున్నత న్యాయస్థానం సమీక్ష చేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.
దేశంలోని అన్ని దిగువ కోర్టుల్లో కలిపి 5వేల ఖాళీలు ఉన్నట్లు 2018లో సుప్రీం కోర్టు తెలిపింది. ఈ ఏడాది జూన్ 30 లోపు ఆ ఖాళీలను భర్తీ చేయాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు జరిగిన నియామక ప్రక్రియపై మంగళవారం సమీక్ష నిర్వహించింది సుప్రీం కోర్టు. అన్ని హైకోర్టుల జనరల్ రిజిస్ట్రార్లతో పాటు 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాల న్యాయశాఖ కార్యదర్శులు హాజరయ్యారు.
పూర్తి నివేదిక..