తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కట్టు కథలు చెప్పను... పని చేసి చూపిస్తా'

ప్రధాని మోదీ  'మన్​ కీ బాత్'​ కార్యక్రమంపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ. తాను ఇక్కడికి వచ్చింది ప్రజల సమస్యలు తెలుసుకునేందుకే కానీ.. మనసులో మాట చెప్పేందుకు కాదన్నారు.

మనసులో మాట చెప్పేందుకు రాలేదు: రాహుల్​

By

Published : Apr 17, 2019, 2:13 PM IST

మనసులో మాట చెప్పేందుకు రాలేదు: రాహుల్​
ప్రధాని నరేంద్రమోదీవి అసత్య హామీలని మరోమారు పరోక్ష విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ. తాను మాత్రం ప్రజల కష్టాలు తెలుసుకుని, వాటి సమస్య పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేస్తానని చెప్పారు.
అమేఠీతోపాటు తాను పోటీచేస్తున్న కేరళ వయనాడ్​లో ఎన్నికల ప్రచారం చేశారు రాహుల్​.

"గత ఐదేళ్ల నుంచి ప్రధాని మోదీ, ఆర్​ఎస్​ఎస్​ ఆలోచనలపై పోరాటం చేస్తున్నాం. వారి ఆలోచనల్లోని అంతరార్థం కేవలం ఒకే వ్యక్తి దేశాన్ని పాలించాలనే. ఆర్​ఎస్​ఎస్​ తన ఆలోచనలను మనపై ఎందుకు రుద్దుతుందో మీరే చెప్పాలి. దక్షిణ భారత​ గళాన్ని వినిపించాలనే అమేఠీతో పాటు వయనాడ్​ నుంచి పోటీ చేస్తున్నా. మీ మాట ఎవరికన్నా తక్కువ కాదు. రాజకీయ నాయకుల్లా అది చేస్తా, ఇది చేస్తా అని చెప్పడానికి ఇక్కడికి రాలేదు. నా మనసులో మాటను చెప్పను. మీ మనసులోని వాటిని అర్థం చేసుకోవడానికే వచ్చాను. "
- రాహుల్​ గాంధీ, కాంగ్రెస్​ అధ్యక్షుడు.

ప్రధానమంత్రిలా 2 కోట్ల ఉద్యోగాలు, బ్యాంకు ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తానని చెప్పడానికి వయనాడ్​కు రాలేదని చెప్పారు రాహుల్​. ప్రజలకు తప్పుడు వాగ్దానాలు ఇవ్వాలనుకోవట్లేదని నొక్కి చెప్పారు కాంగ్రెస్​ అధ్యక్షుడు.

ABOUT THE AUTHOR

...view details