తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కశ్మీర్​ లోయలో సద్దుమణిగిన ఉద్రిక్తతలు

కశ్మీర్​ లోయలో ఆల్​ఖైదా ఉగ్రవాది జాకీర్​ మూసా ఎన్​కౌంటర్​ అనంతరం నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగాయి. రెండు రోజుల పాటు విధించిన కర్ఫ్యూ ఎత్తివేశారు. పౌర సేవలు ఆరంభమయ్యాయి. ప్రస్తుతం కశ్మీర్​లోని అన్ని ప్రాంతాల్లో ఎలాంటి నిషేధం లేదని తెలిపారు అధికారులు.

కశ్మీర్​లో సద్దుమణిగిన ఉద్రిక్తతలు.. పౌర సేవలు ప్రారంభం

By

Published : May 26, 2019, 1:35 PM IST

కశ్మీర్​లో సద్దుమణిగిన ఉద్రిక్తతలు.. పౌర సేవలు ప్రారంభం
కశ్మీర్​ లోయలో ఉద్రిక్త పరిస్థితులు సద్దుమణిగాయి. ఆల్​ఖైదా ఉగ్రవాది జాకీర్​ మూసా ఎన్​కౌంటర్​తో విధించిన నిషేధాజ్ఞలను ఎత్తివేశారు అధికారులు. సాధారణ వాతావరణం నెలకొందని తెలిపారు. ప్రస్తుతం అన్ని పౌర సేవలు ప్రారంభమయ్యాయి.

" ఈ రోజు ఎలాంటి దాడులు లేకపోవటం వల్ల సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. ఏ ప్రాంతంలోనూ నిషేదాజ్ఞలు విధించలేదు. ఉదయం నుంచి ప్రజారవాణా ప్రారంభమవటం వల్ల దుకాణాలు, పెట్రోల్​ పంపులు, ఇతర వ్యాపార సముదాయాలు తిరిగి తెరుచుకున్నాయి."
-పోలీసు అధికారి, కశ్మీర్​

పుల్వామా జిల్లా త్రాల్​ ప్రాంతంలో ఆల్​ఖైదా అనుబంధ సంస్థ అన్సార్​ ఘజ్వాత్​ ఉల్​ హింద్​ ఉగ్రసంస్థ అధినేత జాకిర్​ మూసాను శుక్రవారం మట్టుబెట్టాయి బలగాలు. శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని ముందు జాగ్రత్తతో కర్ఫ్యూ విధించారు. శనివారం సైతం కర్ఫ్యూను కొనసాగించారు. అంతర్జాల సేవలను నిలిపేశారు.

ఇదీ చూడండి:కాటేదాన్​ ప్లాస్టిక్​ పరిశ్రమలో అగ్నిప్రమాదం

ABOUT THE AUTHOR

...view details