ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నీరవ్​ సతీమణికి నాన్​ బెయిలబుల్ వారెంట్ - అమీ మోదీ

పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్​ మోదీ సతీమణిపై నాన్​ బెయిలబుల్ వారెంట్​ జారీ చేసింది ముంబై ప్రత్యేక కోర్టు. ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన అదనపు ఛార్జ్​షీట్​ను అనుసరించి ఈ నిర్ణయం తీసుకుంది.

నీరవ్​ సతీమణికి నాన్​ బెయిలబుల్ వారెంట్
author img

By

Published : Mar 16, 2019, 8:56 AM IST

పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సతీమణికి నాన్​ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది ముంబై ప్రత్యేక కోర్టు. ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన అదనపు ఛార్జ్​షీట్ ఆధారంగా నిర్ణయం తీసుకున్నారు న్యాయమూర్తి జస్టిస్​ ఎం.ఎస్. అజ్మీ. కొత్తగా చేర్చిన ఛార్జ్​షీట్​లో నేరానికి సంబంధించిన ఇతర ఆధారాలనుపొందుపరిచారు అధికారులు.

అంతర్జాతీయ బ్యాంకు ఖాతా నుంచి 30 మిలియన్​ డాలర్లను అమీ మోదీ తరలించారని పేర్కొంది ఈడీ. ఈ మొత్తంతో అమెరికాలోని న్యూయార్క్​లోఆస్తిని కొనుగోలు చేసినట్లు తెలిపింది.

పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చెందిన కొందరు అధికారులతో కుమ్మక్కయి రూ. 14వేల కోట్ల రుణాల్ని మోదీ, ఆయన బంధువు మెహుల్ ఛోక్సీ ఎగవేశారని గతేడాది మే నెలలో దాఖలు చేసిన తొలి ఛార్జ్​షీట్​లోఈడీ పేర్కొంది. 2018లో కుంభకోణం వెలుగుచూసే వరకుఏడేళ్లపాటు ఇదే తంతు కొనసాగించారనిఅధికారులు వెల్లడించారు.

నీరవ్​మోదీ లండన్​లోని ఓవిలాసవంతమైన ఇంటిలో నివసిస్తున్న విషయాన్ని బ్రిటన్ వార్తా సంస్థ గతవారం బయటపెట్టింది.

ABOUT THE AUTHOR

author-img

...view details