ప్రజాప్రతినిధులపై కేసుల సత్వర విచారణ అంశంపై ఆయా రాష్ట్రాల హైకోర్టులు అందించిన నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించారు అమికస్ క్యూరి విజయ్ హన్సారియా. చాలా రాష్ట్రాలు నోడల్ ప్రాసిక్యూషన్ అధికారులను నియమించలేదని.. జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మసనానికి వివరించారు.
కనీసం రెండేళ్లకు నోడల్ ప్రాసిక్యూషన్ అధికారులను నియమించేలా రాష్ట్రాలను ఆదేశించాలని ధర్మసనాన్ని కోరారు హన్సారియా. ఈ మేరకు కొన్ని ధర్మసనానికి కొన్ని సూచనలు చేశారు.
"కేసులను ప్రాధాన్య క్రమంలో విచారించాలి. కొత్త కేసులు, అధిక శిక్ష పడే కేసులు, ప్రస్తుతం ప్రజాప్రతినిధులుగా ఉన్న వారి కేసుల విచారణకు ప్రాధాన్యమివ్వాలి. సాక్షులకు భద్రత కల్పించడంపై ట్రయల్ కోర్టు నిర్ణయం తీసుకునేలా ఆదేశించాలి" అని కోర్టును కోరారు హన్సారియా.
మూడు రాష్ట్రాల్లో..