తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నో టైం: ఆఫీస్‌లో పెళ్లిచేసుకున్న అధికారులు - Recent love marriages

అతడు ఐఏఎస్‌.. ఆమె ఐపీఎస్‌. మనసులు కలిశాయి. కుటుంబాలు అంగీకరించాయి. ఇంకేముంది అంగరంగ వైభవంగా పెళ్లి జరగాలి. అయితే ఇద్దరివీ సివిల్స్‌ ఉద్యోగాలు.. ఉరుకులు పరుగుల జీవితాలు! గ్రాండ్‌గా వివాహం చేసుకునేందుకు సమయం దొరకలేదు. ఫలితంగా ఆఫీస్‌లోనే పెళ్లి చేసుకుని మూడుముళ్ల బంధంతో ఒక్కటయింది ఈ జంట. ఈ అరుదైన ఘటన కోల్​కతాలో జరిగింది.

No Time - They married in Office
నో టైం... ఆఫీస్‌లో పెళ్లిచేసుకున్న అధికారులు

By

Published : Feb 15, 2020, 9:22 PM IST

Updated : Mar 1, 2020, 11:33 AM IST

ఓ ఐఏఎస్​, మరో ఐపీస్​ ఆఫీసర్లిద్దరూ ప్రేమించుకున్నారు. వారి కుటుంబాలు అంగీకరించాయి. కానీ అంగరంగ వైభవంగా జరగాల్సిన వీరి వివాహానికి.. సరైన తీరికలేక సాదాసీదాగా ఆఫీసులోనే జరిగింది. పంజాబ్‌కు చెందిన తుషార్‌ సింగ్లా 2015లో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం కోల్‌కతాలోని ఉలుబెరియాలో ఎస్‌డీవోగా పనిచేస్తున్నారు సింగ్లా. పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన నవజోత్‌ సిమి 2017లో బిహార్‌ కేడర్‌ నుంచి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. ఈమె పట్నాలో విధులు నిర్వహిస్తున్నారు. ఏడాది క్రితం ఓ కార్యక్రమంలో పరిచయమైన వీరి మధ్య స్నేహం చిగురించింది. మిత్రబంధం కాస్తా ప్రేమగా మారినందున.. ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.

రిజిస్ట్రార్​ సమక్షంలోనే...

అయితే.. పశ్చిమబెంగాల్‌లో వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తుషార్‌ సింగ్లా ఇటీవల చాలా బిజీ అయ్యారు. ఫలితంగా తరచూ పెళ్లిని వాయిదా వేయాల్సి వచ్చింది. ఇక వేచి ఉండలేని ఈ జంట ఓ నిర్ణయానికి వచ్చారు. శుక్రవారం ప్రేమికుల రోజును పురస్కరించుకుని నవజోత్‌ సిమి పట్నా నుంచి కోల్‌కతా వెళ్లారు. అక్కడ సింగ్లా ఆఫీస్‌లోనే.. రిజిస్ట్రార్‌ను పిలిపించి ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వధూవరుల కుటుంబ సభ్యులు, ఆఫీస్‌ సిబ్బంది మధ్య రిజిస్టర్​ మ్యారేజ్‌ చేసుకుని దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టారు.

2021లో గ్రాండ్​ విందు...

పని ఎక్కువగా ఉండటం వల్లే ఇలా సింపుల్‌గా పెళ్లి చేసుకున్నామని, 2021లో బెంగాల్‌ ఎన్నికలు ముగిశాక.. తప్పకుండా గ్రాండ్‌గా విందు ఏర్పాటు చేస్తామని చెబుతున్నారీ నూతన వధూవరులు.

ఇదీ చదవండి:రామాయణం థీమ్​తో కొత్త రైలు.. మార్చి 10న ప్రారంభం!

Last Updated : Mar 1, 2020, 11:33 AM IST

ABOUT THE AUTHOR

...view details