తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఆపరేషన్​ కరోనా'పై మోదీ కీలక వ్యాఖ్యలు - modi says no corona

కరోనా వైరస్​పై ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు ప్రధాని నరేంద్ర మోదీ. ప్రజలను ఆరోగ్యంగా ఉంచేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ వదులుకోబోమని పేర్కొన్నారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు చేపడుతున్నామని భరోసా ఇచ్చారు మోదీ.

modi corona
'ఆపరేషన్​ కరోనా'పై మోదీ కీలక వ్యాఖ్యలు

By

Published : Mar 16, 2020, 2:51 PM IST

ప్రజారోగ్యమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యాంశమని ఉద్ఘాటించారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. కరోనా వైరస్​పై పోరాడేందుకు ప్రజలు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ప్రజారోగ్యం కోసం అన్ని చర్యలు చేపడతామని.. ఉన్న ఏ ఒక్క అవకాశాన్నీ వదిలివేయమని స్పష్టంచేశారు.

కరోనాపై పోరాటంలో వైద్యులు, నర్సులు, ఆరోగ్య శాఖ సిబ్బంది చేస్తున్న కృషిని మెచ్చుకున్నారు మోదీ. వైద్య సిబ్బంది కరోనాపై పోరాడుతున్నారని.. దేశ ప్రజలు వారి సేవలను గుర్తించాలని కోరుతూ 'ఇండియా ఫైట్స్​ కరోనా' హ్యాష్ టాగ్​తో వరుస ట్వీట్లు చేశారు. వైద్య సిబ్బంది, మునిసిపాలిటీ కార్మికులు, విమానాశ్రయ సిబ్బంది చేస్తున్న సేవలను గుర్తిస్తే వారి మనోబలం మరింత వృద్ధి చెందుతుందని పేర్కొన్నారు మోదీ.

కరోనాపై పోరాటంలో భారత్ సమష్టిగా ముందుకెళ్తుందనే అంశమై పలువురు చేసిన పోస్టు​లను రీట్వీట్ చేశారు ప్రధాని.

పర్యటనల రద్దుపై..

కరోనా వ్యాప్తి అరికట్టేందుకు తాను అన్ని సమావేశాలను, ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నట్లు ఓ వ్యక్తి ట్విట్టర్​లో పోస్ట్ చేశాడు. దీనిపై స్పందించారు ప్రధాని. అతనిది మంచి నిర్ణయమని.. అనవసర ప్రయాణాలు, విహార యాత్రలు వంటి వాటిని రద్దు చేసుకోవడం ఆహ్వానించదగిన విషయాలని తెలిపారు.

బాధ్యతగా ఉండండి..

భారత పౌరులు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారని గుర్తు చేశారు మోదీ. ఇతరులను అపాయంలోకి నెట్టే ఏ పని చెయ్యరని పేర్కొన్నారు. కరోనా నియంత్రణ కోసం ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు చేపడుతున్నామని మరో ట్వీట్​కు సమాధానమిచ్చారు ప్రధాని.

ఇదీ చూడండి:కూరగాయల లిప్​స్టిక్​తో ఇక ఆరోగ్యం ఫెంటాస్టిక్​!

ABOUT THE AUTHOR

...view details