అసోం ఎన్ఆర్సీ తుది జాబితాలో పేర్లు లేని పౌరులకు ఊరట కల్పిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. జాబితాలో లేని వ్యక్తులు ఫారిన్ ట్రైబ్యునళ్లను నాలుగు నెలల్లోపు ఆశ్రయించేందుకు కేంద్ర హోంశాఖ అవకాశం కల్పించింది. పౌరుల సౌలభ్యం కోసం ఇప్పటికే ఉన్న 100 ట్రైబ్యునల్స్కు అదనంగా మరో 200 ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.
రెండు రోజుల క్రితం విడుదలైన ఎన్ఆర్సీ జాబితాలో 19 లక్షల మంది వివరాలు గల్లంతయ్యాయి. వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అసోం ముఖ్యమంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. ప్రభుత్వపరంగా అందరినీ సంరక్షిస్తామన్నారు. తుది జాబితాలో పేర్లు లేని వారందరికీ భారత పౌరసత్వం పొందేందుకు వీలుగా చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.