తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'జైషే ఉగ్రవాదుల వెన్నులో వణుకు పుట్టించాం' - ధిల్లాన్​ సింగ్​

పుల్వామా ఉగ్రదాడి అనంతరం జైషే మహమ్మద్​ ఉగ్రవాదుల ఏరివేతకు భద్రత బలగాలు తీవ్ర చర్యలు చేపట్టాయని సీఆర్​పీఎఫ్​ లెఫ్టినెంట్​ జనరల్​ ధిల్లాన్​ సింగ్​ తెలిపారు. జైషే ఉగ్రవాదుల వెన్నులో వణుకు పుట్టించామన్నారు. ప్రస్తుతం కశ్మీర్​ లోయలో ఆ సంస్థకు నాయకత్వం వహించేందుకు ఎవరూ సిద్ధంగా లేరని తెలిపారు.

'జైషే ఉగ్రవాదుల వెన్నులో వణుకు పుట్టించాం'

By

Published : Apr 25, 2019, 9:52 AM IST

జమ్ముకశ్మీర్​లో ఉగ్రవాదుల ఏరివేతకు భద్రత బలగాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయని సీఆర్​పీఎఫ్​ లెఫ్టినెంట్​ జనరల్​ ధిల్లాన్​ సింగ్​ స్పష్టం చేశారు. పూల్వామా ఉగ్రదాడి అనంతరం జైషేను అణచివేసేందుకు సిద్ధమైనట్టు తెలిపారు. ఫలితంగా ప్రస్తుతం కశ్మీర్​ లోయలో జైషేకు నాయకత్వం వహించేందుకు ఎవరూ సిద్ధంగా లేరని తెలిపారు.

'జైషే ఉగ్రవాదుల వెన్నులో వణుకు పుట్టించాం'

" ఈ ఏడాది మొత్తం 69 మంది ముష్కరులు హతమయ్యారు. 12 మంది పట్టుబడ్డారు. పుల్వామా ఉగ్రదాడి అనంతరం 41 మందిని మట్టుబెట్టాం. అందులో 25 మంది జైషే మహమ్మద్​కు చెందిన వారు. పాకిస్థాన్​, ఇతర దేశాలకు చెందిన ఏ ప్లస్​, అంతకంటే పై స్థాయికి చెందిన 13 మంది ఉన్నారు. మేము జైషే నాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నాము. కశ్మీర్​ లోయలో ప్రస్తుతం జైషే సంస్థకు నాయకత్వం వహించేందుకు ఎవరూ సిద్ధంగా లేరు. పాకిస్థాన్​ ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ, జైషే సంస్థను అణచివేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం."

- లెఫ్టినెంట్​ జనరల్​ ధిల్లాన్​ సింగ్​, సీఆర్​పీఎఫ్​.

ఈ ఏడాది శాంతిభద్రత సమస్యలు తగ్గిపోయాయని తెలిపారు. ఉగ్రవాదంలోకి స్థానిక యువత నియమకాలు పూర్తిగా తగ్గాయని చెప్పారు.
2018లో 270 మంది ఉగ్రవాదులు హతమయ్యారని, అనేక మంది పట్టుబడ్డారని తెలిపారు. అందులో చాలా మందిని జైషే మహమ్మద్​, లష్కరే తోయిబాకు చెందిన వారిగా గుర్తించామని చెప్పారు.

ఇదీ చూడండి:జమ్ములో ఎన్​కౌంటర్​- ఇద్దరు ముష్కరుల హతం

ABOUT THE AUTHOR

...view details