తెలంగాణ

telangana

By

Published : Aug 16, 2020, 7:20 PM IST

ETV Bharat / bharat

తమిళనాడుపై కరోనా పంజా- 5,950 కొత్త కేసులు

దేశంలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్త కేసుల్లో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. తమిళనాడులో కొత్తగా 5,950 కేసులు.., కేరళలో 1530 కేసులు వచ్చాయి. ఒడిశాలో రికార్డు స్థాయిలో 2,924 మందికి వైరస్​ సోకింది. యూపీలో రికవరీలు లక్ష మార్కు దాటాయి. దేశ రికవరీ రేటు 72 శాతానికి చేరుకుంది.

COVID-19
తమిళనాడుపై కరోనా పంజా

దేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రోజు రోజుకు కొత్త కేసుల్లో రికార్డులు నమోదవుతున్నాయి. తమిళనాడులో ఆదివారం 5,950 కొత్త కేసులు వచ్చాయి. 125 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 3,38,055, మరణాలు 5,766కు చేరాయి. 2,78,270 మంది వైరస్​ నుంచి కోలుకోగా.. ఇంకా 54,019 యాక్టివ్​ కేసులు ఉన్నాయి.

  • కేరళలో కరోనా వైరస్​ మళ్లీ విజృంభిస్తోంది. కొత్తగా 1530 కేసులు వచ్చాయి. 10 మంది మరణించారు. ఇదే సమయంలో 1099 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 28,878 మంది కోలుకోగా.. 15,310 యాక్టివ్​ కేసులు ఉన్నాయి.
  • దిల్లీలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతోంది. కొత్తగా 652 కేసులు నమోదయ్యాయి. 8 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 1,52,580, మరణాలు 4,196కు చేరాయి.
  • అసోంలో కొత్తగా 1,057 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. మొత్తం కేసుల సంఖ్య 75వేల మార్కును దాటింది. మరో 8 మంది మరణించగా.. మొత్తం మృతుల సంఖ్య 182కు చేరింది. 53 వేల మందికిపైగా వైరస్​ నుంచి కోలుకున్నారు.
  • యూపీలో కరోనా రికవరీలు 1 లక్ష మార్కును దాటాయి. రికవరీ రేటు 65.03 శాతానికి చేరింది. ఆదివారం కొత్తగా 4,357 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. మొత్తం కేసుల సంఖ్య 1,54,418కి చేరింది. మరో 56 మంది మృతి చెందగా మొత్తం మృతుల సంఖ్య 2,449కి చేరింది.
  • ఒడిశాలో రికార్డు స్థాయిలో 2,924 మందికి వైరస్​ సోకింది. మొత్తం కేసుల సంఖ్య 60,050కి చేరింది. మరో 10 మంది ప్రాణాలు కోల్పోగా.. మొత్తం సంఖ్య 343కు చేరింది.
  • మిజోరాంలో రికార్డు స్థాయిలో 64 కొత్త కేసులు వచ్చాయి. దాంతో మొత్తం కేసుల సంఖ్య 777కు చేరింది. ప్రస్తుతం 421 మంది చికిత్స పొందుతున్నారు. 356 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 45.81 శాతంగా ఉంది.
  • పుదుచ్ఛేరిలో 384 కేసులు, 4 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 7,732కు చేరింది. 4,443 మంది వైరస్​ నుంచి కోలుకోగా.. 3,179 మంది చికిత్స పొందుతున్నారు.
  • అరుణాచల్​ ప్రదేశ్​లో కొత్తగా 51 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. మొత్తం కేసుల సంఖ్య 2,658కి చేరింది. కొత్త కేసుల్లో 28 మంది భద్రతా సిబ్బంది ఉన్నారు.

72 శాతానికి రికవరీ రేటు..

ఓవైపు కరోనా కేసులు పెరుగుతున్నా.. వైరస్​ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దేశంలో రికవరీ రేటు 72 శాతానికి చేరుకున్నట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరణాల రేటు 1.93 శాతానికి తగ్గినట్లు తెలిపింది. అంతర్జాతీయంగా అతితక్కువ మరణాల రేటు ఉన్న దేశాల్లో భారత్​ ఒకటని ఉద్ఘాటించింది. కేంద్రం, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల సమన్వయంతోనే సాధ్యమైందని పేర్కొంది.

50 వేల మరణాలు చేరేందుకు అమెరికాలో 23 రోజులు, బ్రెజిల్​లో 95 రోజులు, మెక్సికోలో 141 రోజులు పడితే.. భారత్​లో 156 రోజులు పట్టినట్లు గుర్తు చేసింది కేంద్రం.

ఇప్పటివరకు దేశంలో 49,980 మంది వైరస్​తో మరణించారు. ఆదివారం ఒక్కరోజే 53,322 మంది వైరస్​ నుంచి కోలుకోగా.. దేశవ్యాప్తంగా 18,62,258 మంది వైరస్​ బారి నుంచి బయటపడ్డారు.

ఇదీ చూడండి: మరుగుజ్జు గ్రహం 'సెరెస్'​పై సమృద్ధిగా నీరు

ABOUT THE AUTHOR

...view details