జాతీయ పౌర జాబితా (ఎన్ఆర్సీ), జాతీయ జనాభా పట్టిక (ఎన్పీఆర్)పై దేశవ్యాప్తంగా వ్యక్తమవుతోన్న ఆందోళనలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టత ఇచ్చారు. ఆ రెండింటికీ అసలు సంబంధమే లేదన్న షా.. ఎన్పీఆర్ కోసం సేకరించిన వివరాలను ఎన్ఆర్సీ కోసం వినియోగించమన్నారు.
"రెండింటి మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. జనాభాను లెక్కించడం కోసమే ఎన్పీఆర్. ఇందులో ఉన్న వివరాలపై దేశంలోని ఎన్నో పథకాలు ఆధారపడి ఉంటాయి. ఎన్ఆర్సీ పూర్తిగా భిన్నం. మీరు ఈ దేశస్థులేనా అని ఆధారాలు అడిగే ప్రక్రియ ఎన్ఆర్సీ. ఎన్పీఆర్, ఎన్ఆర్సీ మధ్య ఎలాంటి సంబంధం లేదు. ఒక ప్రక్రియ వివరాలను మరో దానికి ఉపయోగించే ప్రసక్తే లేదు. రెండింటికీ వేరువేరు చట్టాలు ఉన్నాయి."
--- అమిత్ షా, కేంద్ర హోంమంత్రి.