తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'అన్ని రాష్ట్రాల్లో హిందీ' పై నిర్ణయం తీసుకోలేదు: జైశంకర్​ - hindi

అన్ని రాష్ట్రాల్లో హిందీ భాషా బోధనను తప్పనిసరి చేసే అంశంపై కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్​. జైశంకర్​.  హిందీ భాష బోధనపై తమిళనాడులో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోన్న నేపథ్యంలో ట్విట్టర్​లో వివరణ ఇచ్చారు జైశంకర్.​

'అన్ని రాష్ట్రాల్లో హిందీ పై నిర్ణయం తీసుకోలేదు'

By

Published : Jun 3, 2019, 7:35 AM IST

Updated : Jun 3, 2019, 8:54 AM IST

హిందీ భాషను దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బోధించాలని జాతీయ విద్యా విధాన ముసాయిదా సిఫారసు చేస్తోంది. దీని అమలుపై తమిళనాడులో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ విషయంపై ట్విట్టర్లో ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు వివరణ ఇచ్చారు విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్​. జైశంకర్.

"జాతీయ విద్యావిధానం ముసాయిదా నివేదిక మాత్రమే మానవ వనరులు అభివృద్ధి శాఖకు అందింది. ప్రజాభిప్రాయ సేకరణ జరగాలి. రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించాలి. ఆ తర్వాతే ముసాయిదాపై తుది నిర్ణయం. కేంద్ర ప్రభుత్వం అన్ని భాషలను గౌరవిస్తుంది. ఏ భాషనూ బలవంతంగా రుద్దబోం."

-జై శంకర్​ ట్వీట్​.

విదేశీ వ్యవహారాల మాజీ మంత్రి సుష్మా స్వరాజ్​ అడుగు జాడల్లో నడుస్తున్నారు నూతన మంత్రి జై శంకర్​. ఆదివారం ట్విట్టర్​లో నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలు, సందేహాలకు సమాధానాలిచ్చారు.

హిందీ బోధనను అన్ని రాష్ట్రాల్లో అమలు చేయాలన్న సిఫారసుపై తమిళనాడు రాజకీయ పార్టీలు డీఎంకే, ఎంఎన్​ఎమ్​లు తీవ్రంగా స్పందించాయి.

విద్యావిధానంపై ఓ కమిటీ ముసాయిదా రూపొందించిదని, దాని అమలుపై తుది నిర్ణయం తీసుకోలేదని మానవ వనరుల శాఖ మాజీ మంత్రి, ప్రస్తుత సమాచార, ప్రచార శాఖ మంత్రి ప్రకాశ్​ జావడేకర్​ తెలిపారు.

ఇదీ చూడండి: 'జై శ్రీరామ్​ను పార్టీ నినాదంగా వినియోగిస్తున్నారు'

Last Updated : Jun 3, 2019, 8:54 AM IST

ABOUT THE AUTHOR

...view details