దిల్లీ మెట్రో రైలులో మహిళలకు ఉచిత ప్రయాణ ప్రతిపాదనను సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఈ ప్రతిపాదనలకు సంబంధించిన ప్రాజెక్టును ప్రైవేటు సంస్థలైన ఫ్రీబైస్, సాప్స్కు ఇచ్చిన నేపథ్యంలో దిల్లీ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించింది సుప్రీం. దిల్లీ మెట్రో వ్యవస్థను నాశనం చేయాలని అనుకుంటున్నారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.ఈ ఉచిత సేవల విషయంలో వెనక్కుతగ్గాలని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ దీపక్ గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం ప్రభుత్వానికి సూచించింది.
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు మెట్రో నాల్గో దశకు సంబంధించి మూడు విషయాలను విచారించింది. మెుదటిది నిర్మాణ సమయంలో వచ్చిన నష్టాన్ని భరించటం, రెండవది జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీకి ఇవ్వవలసిన మెుత్తం చెల్లించటం, మూడవది మెట్రోకు సంబంధించిన భూ ఖర్చులు.