తెలంగాణ

telangana

ETV Bharat / bharat

బక్రీద్​ మిఠాయిలు పంచుకునేందుకు పాక్​ నో

భారత్​, పాకిస్థాన్​ సరిహద్దు ప్రాంతాల్లో బక్రీద్​ సందర్భంగా ఏటా మిఠాయిలు పంచుకునే సంప్రదాయం ఈసారి జరగలేదు. కశ్మీర్​ పరిణామాల నేపథ్యంలో ఇందుకు పొరుగు దేశం అంగీకరించలేదు.

బక్రీద్​ మిఠాయిలు పంచుకునేందుకు పాక్​ నో

By

Published : Aug 12, 2019, 6:15 PM IST

Updated : Sep 26, 2019, 6:55 PM IST

జాతీయ, సాంస్కృతిక వేడుకల సందర్భంగా భారత్‌, పాకిస్థాన్‌ సైనికులు మిఠాయిలు పంచుకోవడం సంప్రదాయం. కానీ ఈసారి బక్రీద్‌కు అలాంటిది జరగలేదు. కశ్మీర్‌ పరిణామాల నేపథ్యంలో మిఠాయిలు పంచుకునేందుకు పొరుగు దేశం అంగీకరించలేదు.

ఉమ్మడి వేడుకలకు సంబంధించి ఆదివారం అటారి-వాఘా సరిహద్దు వద్ద ఉన్న బీఎస్​ఎఫ్​ అధికారులు తమ నిర్ణయాన్ని ఇస్లామాబాద్‌కు చేరవేయగా.. పాక్‌ తిరస్కరించింది. ఇరు దేశ సైనికుల మధ్య ఎలాంటి కార్యక్రమాలు ఉండవని స్పష్టంచేసింది.

చివరిసారి జూన్‌లో రంజాన్‌ సందర్భంగా ఇరు దేశాల సైనికులు మిఠాయిలు పంచుకున్నారు.

బంగ్లాదేశ్​ సైనికులతో...

భారత్​-బంగ్లాదేశ్​ సరిహద్దులో బక్రీద్​ వేడకలు నిర్వహించారు. ఇరుదేశాల అధికారులు పరస్పరం​ శుభాకాంక్షలు చెప్పుకుని, మిఠాయిలు పంచుకున్నారు.

ఇదీ చూడండి: కశ్మీర్​లో 'ఈద్' ప్రశాంతం... కానీ​ కళ తప్పింది!

Last Updated : Sep 26, 2019, 6:55 PM IST

ABOUT THE AUTHOR

...view details