తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'ఇద్దరు మోదీలకు భేదం లేదు' - నరేంద్ర మోదీ

పంజాబ్ నేషనల్ బ్యాంక్ కుంభకోణం నిందితుడు నీరవ్​ మోదీకి, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి భేదమేమీ లేదని వ్యంగ్యాస్త్రాలు సంధించారు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ.

నీరవ్​ మోదీ, నరేంద్రమోదీలపై రాహుల్ విమర్శలు

By

Published : Mar 10, 2019, 12:04 AM IST

ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విరుచుకుపడ్డారు కాంగ్రెస్ అధినేత రాహుల్​ గాంధీ. పంజాబ్​ నేషనల్ బ్యాంకు కుంభకోణం నిందితుడు నీరవ్​మోదీకి, ప్రధానమంత్రి నరేంద్రమోదీకి భేదమేమీ లేదన్నారు. ఇద్దరు న్యాయవ్యవస్థకు అతీతులని రాహుల్​ ఎద్దేవా చేశారు.

పీఎన్​బీలో రూ. 13500 కోట్లను ఎగవేసి బ్రిటన్​లో తలదాచుకుంటున్నారు నీరవ్​ మోదీ. నీరవ్​ మోదీ మీసంతో ఉన్న వీడియో తాజాగా వెలుగు చూసిన కారణంగా ఈ వ్యాఖ్యలు చేశారు రాహుల్. నీరవ్​ మోదీ 8 మిలియన్​ పౌండ్ల విలువచేసే గృహంలో నివసిస్తూ అక్కడా వజ్రాల వ్యాపారాన్ని ప్రారంభించారని సమాచారం. నీరవ్​ మోదీకి, ఆయన సోదరుడి వంటి వాడైన నరేంద్రమోదీకి ఏ భేదమూ లేదని ఎద్దేవా చేశారు రాహుల్. భవిష్యత్తులో ఇద్దరు మోదీలు న్యాయ విచారణ ఎదుర్కోక తప్పదని రాహుల్ జోస్యం చెప్పారు.

రుణఎగవేతదారులు రూ. లక్ష కోట్ల విలువైన ప్రజాధనాన్ని బ్యాంకుల నుంచి దోచేశారన్నారు రాహుల్.

మీ పాలనలోనే...

2011లో కాంగ్రెస్ పాలనలోనే నీరవ్​ మోదీ తన కుంభకోణాన్ని ప్రారంభించాడని కాంగ్రెస్ వ్యాఖ్యల్ని తిప్పికొట్టింది భాజపా. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఈ కుంభకోణాన్ని బయటపెట్టిందని పేర్కొంది.

ఇదీ చూడండి:పోలీసు పల్లకీలో.... బెల్ట్​షాపు నిందితుడు

ABOUT THE AUTHOR

...view details