తెలంగాణ

telangana

ETV Bharat / bharat

దిల్లీ వైపు నితీశ్ చూపు.. రాష్ట్ర హోదాకు డిమాండ్​ - బిహార్​కు ప్రత్యేకహోదా కావలన్న ముఖ్యమంత్రి

దిల్లీలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో  బిహార్​ ముఖ్కమంత్రి, జనతాదళ్​ అధినేత నితీశ్​ కుమార్ దేశ రాజధానికి పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కల్పించాలని డిమాండ్​ చేశారు. రాబోయే ఎన్నికల్లో జేడీయూ పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బిహార్​కు కూడా ప్రత్యేక హోదా కల్పించాలని కోరారు.

దిల్లీ ఎన్నికలకు సిద్ధమవుతోన్న జేడీయూ

By

Published : Oct 23, 2019, 10:17 PM IST

కేంద్రపాలిత ప్రాంతమైన దిల్లీకి రాష్ట్ర హోదా కల్పించాలని బిహార్‌ ముఖ్యమంత్రి, జనతాదళ్(యూ) ​అధినేత నితీశ్ కుమార్ డిమాండ్‌ చేశారు. పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించిన నితీశ్.. బిహార్‌కి ప్రత్యేక హోదా కల్పించాలని మరోసారి డిమాండ్ చేశారు.

దిల్లీకి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ తమ పార్టీ అభ్యర్థులను నిలబెట్టాలని నితీశ్ భావిస్తున్నారు. ప్రస్తుతం జేడీయూ, భాజపా మిత్రపక్షమైనప్పటికీ, పొత్తు కేవలం బిహార్‌ వరకే పరిమితమని నితీశ్ ఇది వరకే స్పష్టం చేశారు. ముఖ్యంగా బిహార్‌, పూర్వాంచల్‌ నుంచి దిల్లీకి వలస వెళ్లిన ఓటర్ల పైనే నితీశ్ ఆశలు పెట్టుకున్నారు.

అందులో భాగంగానే 'హోదా' డిమాండ్ అందుకున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా దిల్లీకి రాష్ట్ర హోదా కోసం ఎప్పటినుంచో ప్రయత్నిస్తోంది.

ఇదీ చూడండి:దిల్లీ పీఠం కోసం 'కాలనీ'లపై కేంద్రం కన్ను

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details