తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మేము అధికారంలోకి వస్తే నితీశ్​ జైలుకే' - తాజా వార్తలు నితీశ్

లోక్​ జనశక్తి పార్టీ అధినేత చిరాగ్​ పాసవాన్​... సీఎం నితీశ్ కుమార్​పై మాటల దాడిని పెంచారు.​ డుమ్​రావ్, బక్సర్ నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల ర్యాలీల్లో ప్రసంగిస్తూ తాము అధికారంలోకి వస్తే నితీశ్​ కుమార్​ జైలుకు వెళ్లక తప్పదన్నారు.

chirag
చిరాగ్

By

Published : Oct 25, 2020, 5:44 PM IST

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ బిహార్​ రాజకీయ నేతలు విమర్శల పదును పెంచారు. తాము అధికారంలోకి వస్తే నితీశ్​ కుమార్​ జైలుకు వెళ్తారని లోక్ జనశక్తి పార్టీ అధినేత చిరాగ్​ పాసవాన్ అన్నారు. రాష్ట్రంలోని డుమ్​రావ్​, బక్సర్​ నియోజకవర్గాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.​

"మేము అధికారంలోకి వస్తే నితీశ్​ కుమార్, ఆయన అధికారులు జైలుకు వెళ్లక తప్పదు. బిహార్​లో మద్యపాన నిషేధం అమలు చేయలేకపోయారు. కల్తీ మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్నారు. ఇందుకోసం నితీశ్​ భారీగా ముడుపులు అందుకుంటున్నారు."

- చిరాగ్​ పాసవాన్, ఎల్​జేపీ అధ్యక్షుడు

ప్రచార సభల్లోనే కాకుండా సామాజిక మాధ్యమాల్లోనూ సీఎం నితీశ్ కుమార్​ను చిరాగ్​ విమర్శిస్తున్నారు.

"'బిహార్​ ఫస్ట్​- బిహారీ ఫస్ట్'​ అమలు చేసేందుకు ఎల్​జేపీ అభ్యర్థులకు దయచేసి ఓటు వేయండి. మిగిలినవారు భాజపాకు ఓటు వెయ్యండి. 'నితీశ్​ లేని సర్కారు' రావాలి."

- చిరాగ్​ పాసవాన్ ట్వీట్

ABOUT THE AUTHOR

...view details