తెలంగాణ

telangana

ETV Bharat / bharat

జేడీయూ అధ్యక్షుడిగా నితీశ్​కుమార్ ఏకగ్రీవ ఎన్నిక - Nitish Kumar elected JD(U) president unopposed for another term

జేడీయూ పార్టీ అధ్యక్షుడిగా నితీశ్​కుమార్ మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిత్రపక్షం భాజపాతో విబేధాలు కొనసాగుతుండటం, వచ్చే ఏడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో జేడీయూ మరోసారి నితీశ్​కుమార్​కే ఓటేసింది.

జేడీయూ అధ్యక్షుడిగా నితీశ్​కుమార్ ఏకగ్రీవ ఎన్నిక

By

Published : Oct 6, 2019, 8:55 PM IST

Updated : Oct 7, 2019, 2:53 PM IST

జేడీయూ అధ్యక్షుడిగా నితీశ్​కుమార్ ఏకగ్రీవ ఎన్నిక

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్​కుమార్​ మరోసారి జేడీయూ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. నామినేషన్​ వేసే సమయం ఆదివారం ముగిసినటప్పటికీ నితీశ్ ఒక్కరే బరిలో ఉన్నారు. ఫలితంగా ఎన్నిక ఏకగ్రీవం అయ్యిందని పార్టీ జాతీయ రిటర్నింగ్ అధికారి అనీల్ హెగ్డే ఆదివారం ప్రకటించారు.

వచ్చే ఏడాది బిహార్ అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఇలాంటి కీలక సమయంలో పార్టీ అధ్యక్షుడిగా నితీశ్​కుమార్​ను మరోసారి ఎన్నుకుంది జేడీయూ. ప్రస్తుతం భాజపా, జేడీయూ మిత్రపక్షాలుగా ఉన్నప్పటికీ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఈ పొత్తు నిలిచే అవకాశం కష్టమే.

మిత్రపక్షం నుంచే విమర్శలు

కేంద్రమంత్రి గిరిరాజ్​ సింగ్​తో సహా భాజపాలోని ఓ వర్గం నాయకులు.. నితీశ్​కుమార్ నాయకత్వంపై విమర్శలు చేస్తున్నారు. బిహార్ వరదలు విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యల విషయంలో వీరు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు.

భాజపా ఎమ్మెల్సీ సంజయ్ పాసవాన్ అయితే నితీశ్​కుమార్​ను తొలగించి, కాషాయ పార్టీ నేతకు ప్రభుత్వ బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇదీ చూడండి:బ్యాంకులకు వరుస సెలవులు.. ఇప్పుడే చూసుకోండి..!

Last Updated : Oct 7, 2019, 2:53 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details