తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'15 లక్షల కోట్లతో రహదారుల అభివృద్ధి' - ఐదేళ్ల ప్రణాళిక

రెండోసారి జాతీయ రహదారులు, రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నితిన్‌ గడ్కరీ భారీ ప్రణాళికలతో ముందుకొచ్చారు. 15 లక్షల కోట్లతో హైవే గ్రిడ్‌ ఏర్పాటు చేయడం సహా జీడీపీ వృద్ధిరేటును పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పీటీఐకి ఇచ్చిన ముఖాముఖిలో తెలిపారు.

నితిన్‌గడ్కరీ

By

Published : Jun 6, 2019, 7:10 AM IST

'15 లక్షల కోట్లతో హైవే గ్రిడ్​ ఏర్పాటే లక్ష్యం'

వరుసగా రెండోసారి జాతీయ రహదారులు, రవాణా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నితిన్‌ గడ్కరీ ఈ సారి పలు లక్ష్యాలను నిర్దేశించుకున్నట్లు వెల్లడించారు.

15 లక్షల కోట్లతో హైవే గ్రిడ్‌ ఏర్పాటు చేయడం, ఖాదీ, ఇతర చిన్న మధ్య తరహా రంగాలకు చెందిన ఉత్పత్తులను గ్లోబలైజ్‌ చేయడం ద్వారా జీడీపీ వృద్ధిరేటును పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

15 లక్షల కోట్లతో రహదారుల నిర్మాణానికి బ్లూ ప్రింట్‌ సిద్ధమైందన్నారు. వీటిలో కనీసం 22 గ్రీన్‌ ఎక్స్‌ప్రెస్‌వేలు ఉంటాయని గడ్కరీ వెల్లడించారు. వివిధ కారణాలతో ఇప్పటికే నిలిచిపోయిన ప్రాజెక్టులను మరో 100 రోజుల్లో పనులు మొదలయ్యేలా చూస్తామని తెలిపారు.

ఇదీ చూడండి:యాప్​లో ఆర్డరివ్వండి.. తాజా 'కొబ్బరి నీళ్లు' తాగండి

ABOUT THE AUTHOR

...view details