తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నిర్భయ దోషులకు డెత్​ వారెంట్​- మార్చి 20న ఉరి అమలు - నిర్భయ దోషులు

nirbhaya
నిర్భయ

By

Published : Mar 5, 2020, 2:37 PM IST

Updated : Mar 5, 2020, 3:01 PM IST

14:33 March 05

నిర్భయ దోషులకు డెత్​ వారెంట్ జారీ చేసింది దిల్లీ కోర్టు. మార్చి 20 ఉదయం 5.30 గంటలకు నలుగురు దోషులకు ఉరి శిక్ష అమలు చేయాలని ఆదేశాలిచ్చింది. నిర్భయ దోషులందరికీ న్యాయపరమైన అన్ని దారులు మూసుకుపోయిన నేపథ్యంలో తాజా ఆదేశాలు జారీ చేసింది దిల్లీ కోర్టు.  

ఉరిశిక్ష అమలును ఆలస్యం చేసేందుకు న్యాయపరమైన అవకాశాలను ఉపయోగించుకున్నారు నిర్భయ దోషులు. చివరి ప్రయత్నంగా పవన్​ కుమార్​ గుప్తా దాఖలు చేసిన క్షమాభిక్ష పిటిషన్​ను రాష్ట్రపతి నిన్న తిరస్కరించారు.  

నలుగురు దోషులు అన్ని అవకాశాలు వినియోగించుకున్నారని.. ఇక వారిని ఉరితీసేందుకు కొత్త తేదీని నిర్ణయించాలని దీల్లీ కోర్టును ఆశ్రయించింది కేజ్రీవాల్​ ప్రభుత్వం. దోషుల తరఫు న్యాయవాది కూడా న్యాయపరమైన అవకాశాలు లేవని స్పష్టం చేశారు. వెంటనే కొత్త తేదీని నిర్ణయిస్తూ దిల్లీ కోర్టు తీర్పునిచ్చింది.  

Last Updated : Mar 5, 2020, 3:01 PM IST

ABOUT THE AUTHOR

...view details