తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మోదీ​ భవంతి భూం! - రాయ్​గఢ్

ఆర్థిక నేరారోపణలు ఎదుర్కొంటున్న నీరవ్​ మోదీకి మహారాష్ట్ర రాయ్​గడ్ జిల్లాలో గల 'రూపణ్య' భవంతిని అధికారులు బాంబులతో పేల్చివేశారు. అలీబాగ్​ కిహిమ్​ బీచ్​లోని ఈ భవంతిని ఈడీ గతంలో స్వాధీనం చేసుకుంది.

నీరవ్ మోదీ

By

Published : Mar 8, 2019, 1:50 PM IST

పంజాబ్​ నేషనల్​ బ్యాంకు కుంభకోణం నిందితుడు, వజ్రాల వ్యాపారి నీరవ్​మోదీ బీచ్​హౌస్​​ను పేల్చివేశారు మహారాష్ట్ర రాయగడ్​ జిల్లా అధికారులు. అలీబాగ్​ కిహిమ్​ బీచ్​లోని 'రూపణ్య' భవంతిని నిబంధనలకు విరుద్ధంగా నిర్మించారని ఆరోపణలున్నాయి.

నీరవ్ మోదీ భవంతి

సరిహద్దుల్లో భవన నిబంధనలను ఉల్లంఘించి నిర్మించినందున భవంతిని కూల్చాలనిరాయ్​గఢ్ కలెక్టర్​ ఆదేశాలు జారీ చేశారు. ఆర్సీసీ పిల్లర్ల సాయంతో కట్టిన భారీ నిర్మాణం కావటం వల్ల బాంబులతో పేల్చి వేయాలని అధికారులు నిర్ణయించారు.

ఈ బంగ్లాను పీఎన్​బీ కేసులో ఈడీ జప్తు చేసింది. అందులోని విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నాక కలెక్టర్​ కార్యాలయానికి ఈ ఏడాది జనవరి 24న అప్పగించింది.

ఇదీ చూడండి:అయోధ్యపై మధ్యవర్తిత్వం

ABOUT THE AUTHOR

...view details