తెలంగాణ

telangana

ETV Bharat / bharat

చెన్నై కేంద్రంగా ఉగ్రకుట్ర-ముగ్గురి అరెస్ట్​

దేశవ్యాప్తంగా దాడులు చేపట్టాలన్న ఉగ్ర కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ) భగ్నం చేసింది. ఇస్లామిక్‌ రాజ్య స్థాపనే లక్ష్యంగా ధ్వంస రచన చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుంది. చెన్నై నాగపట్టణంలోని కుట్రదారుల ఇళ్లు, కార్యాలయాలపై అధికారులు తనిఖీలు నిర్వహించారు.

By

Published : Jul 13, 2019, 11:03 PM IST

చెన్నై కేంద్రగా ఉగ్రకుట్ర...ముగ్గురి అరెస్ట్​

ఇస్లామిక్​ రాజ్య స్థాపనే లక్ష్యంగా దేశవ్యాప్తంగా విధ్వంసం సృష్టించాలకున్న ఉగ్ర కుట్రను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్​ఐఏ) భగ్నం చేసింది. చెన్నై నాగపట్టణంలో విదేశీయులు కొందరు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులు చేసేందుకు అన్సురులా అనే ఉగ్ర ముఠాను ఏర్పాటు చేశారని పేర్కొంది. వీరిపై జులై 9న కేసు నమోదైనట్లు తెలిపింది.

చెన్నైలో నివాసం ఉంటున్న సయ్యద్‌ మహ్మద్‌ బుఖారి, నాగపట్టణానికి చెందిన హసన్‌ అలీ యూనుస్‌మరికార్‌, మహ్మద్‌ యూసుఫుద్దీన్‌ హ్యారిస్‌ మహ్మద్‌, వారి సహాయకులు దేశంలో ఉగ్రదాడుల కోసం నిధులు సేకరించారని తెలిపింది ఎన్​ఐఏ. ఇస్లామిక్‌ రాజ్యస్థాపన లక్ష్యంగా వారు ఉగ్రకుట్రకు ప్రణాళిక రచించారని వెల్లడించింది.

ఉగ్ర కుట్రకు పాల్పడిన నిందితులపై చట్ట విరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం, ఐపీసీ ప్రకారం ఎన్‌ఐఏ కేసులు నమోదు చేసింది. నిందితుల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించింది. సోదాల్లో 9 మొబైళ్లు, 15 సిమ్‌ కార్డులు, 7 మెమోరీ కార్డులు, 3 ల్యాప్‌టాప్‌లు, 5 హర్డ్‌ డిస్క్‌లు, కొన్ని పత్రాలు, పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు ఎన్ఐఏ అధికారులు.

ఇదీ చూడండి: చంద్రయాన్​-2 పరీక్షకు తమిళనాడు మట్టి!

ABOUT THE AUTHOR

...view details