తెలంగాణ

telangana

ETV Bharat / bharat

నేడు భారత్​కు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్స - శ్రీలంక నూతన అధ్యక్షుడు గొటాబయ రాజకప్స భారత్​లో

శ్రీలంక నూతన అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఈ రోజు భారత్​కు రానున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక అంశాలను మరింత బలోపేతం చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీతో రాజపక్స చర్చలు జరుపుతారని విదేశాంగ మంత్రి జయ్​శంకర్​ వెల్లడించారు.

lanka visit
నేడు భారత్​ పర్యటనకి గొటాబయ రాజకప్స

By

Published : Nov 28, 2019, 7:55 AM IST

Updated : Nov 28, 2019, 11:32 AM IST

రెండు రోజుల పర్యటనలో భాగంగా నేడు భారత్​కు రానున్నారు శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు భారత్​లో పర్యటించనున్నారు.శుక్రవారం రాష్ట్రపతి భవన్​లో రాజపక్స గౌరవార్థం సత్కార కార్యక్రమం నిర్వహించనున్నారు. అదే రోజున మోదీ, రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​తో భేటీ కానున్నట్లు విదేశాంగ మంత్రి జయ్​శంకర్​ వెల్లడించారు.

మోదీతో కలిసి ఇరు దేశాల మధ్య అభివృద్ధి, శాంతి, భద్రత వంటి అంశాలు మరింత బలోపేతం చేసే దిశగా చర్చలు జరగనున్నాయి. లంక ఎన్నికల ఫలితాల అనంతరం ఆదివారం నాడు ప్రధాని మోదీ స్వయంగా రాజపక్సకు ఫోన్​ ద్వారా భారత ప్రజలందరి తరపున శుభాకాంక్షలు తెలిపారు.రాజపక్స నాయకత్వంలో లంకలో శాంతి భద్రతలు మెరుగుపడాలని ఆకాంక్షించారు మోదీ.

రాజపక్స నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఇదే ఆయనకు తొలి అధికారిక విదేశీ పర్యటన.

ఇదీ చూడండి : 'దేశంలో ఆర్థిక మాంద్యం లేదు.. ఉండబోదు'

Last Updated : Nov 28, 2019, 11:32 AM IST

ABOUT THE AUTHOR

...view details