తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మధ్యప్రదేశ్​లో కొత్త ట్విస్ట్​​.. 10మంది ఎమ్మెల్యేలు విముఖత!

మధ్యప్రదేశ్ రాజకీయ సంక్షోభం మరో కొత్త మలుపు తిరుగుతోంది. సింధియా వర్గంలోని 10మంది ఎమ్మెల్యేలు భాజపాలో చేరేందుకు సిద్ధంగా లేరని కాంగ్రెస్​ సీనియర్ నేత సజ్జన్​ సింగ్ తెలిపారు. వారిని తప్పుదోవ పట్టించినట్లు చెప్పారని వెల్లడించారు.

new-twist-in-madhya-pradesh-political-crisis
మధ్యప్రదేశ్​లో సంక్షోభంలో కొత్త ట్విస్ట్

By

Published : Mar 11, 2020, 1:16 PM IST

బెంగళూరు సమీపంలోని రిసార్టులో ఉన్న మధ్యప్రదేశ్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో కొందరు భాజపాలో చేరేందుకు సిద్ధంగా లేరని తెలుస్తోంది. మొత్తం 19 మంది ఎమ్మెల్యేలు రిసార్టులో ఉండగా, వారిలో పదిమంది ఎమ్మెల్యేలు, ముగ్గురు మంత్రులు సింధియాతో కలిసి భాజపాలో చేరేందుకు విముఖతతో ఉన్నారని సమాచారం. సింధియా నూతన పార్టీ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. తాము సింధియా కోసమే వచ్చామని, భాజపాలో చేరేందుకు కాదని వారు అభిప్రాయపడుతున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.

రాజీనామా చేసిన ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ సీనియర్ నేత సజ్జన్ సింగ్.. రిసార్టులో భేటీ అయినట్లు తెలిపారు. సింధియాతో వెళ్లేందుకు ఎమ్మెల్యేలు ఎవరూ సిద్ధంగా లేరని ఆయన పేర్కొన్నారు. తమను తప్పుదోవ పట్టించి బెంగళూరుకు తీసుకొచ్చారని ఎమ్మెల్యేలు వెల్లడించినట్లు స్పష్టం చేశారు.

మధ్యప్రదేశ్ ఎమ్మెల్యేలు ఉన్న బెంగళూరు రిసార్టు ముందు కర్ణాటక కాంగ్రెస్ యువజన విభాగం ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. పార్టీని వీడటం అన్యాయమని కార్యకర్తలు నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులను రిసార్టు నుంచి పంపించేశారు పోలీసులు.

ఇదీ చూడండి: కాంగ్రెస్​ ఎమ్మెల్యేల గాలానికి నెల రోజుల ముందే స్కెచ్​?

ABOUT THE AUTHOR

...view details