అమ్మతనానికే మచ్చ తెచ్చే సంఘటన కర్ణాటక బెల్గాం జిల్లాలో జరిగింది. తన పొత్తిళ్లల్లో సురక్షితంగా ఉండాల్సిన నవజాత శిశువును రోడ్డు పక్కన కొత్తగా ఏర్పాటు చేస్తున్న నీటి పైపుల్లో పడేసి వెళ్లింది ఓ కర్కశ తల్లి. అది గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సమీపంలో జరగటం గమనార్హం.
చచాడీ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో ఓ శిశువు అరుపులు విని ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ సిబ్బంది వెతికారు. రోడ్డు పక్కన కొత్తగా నిర్మిస్తున్న మంచి నీటి పైపుల్లో అప్పుడే పుట్టిన శిశువును గుర్తించి కాపాడారు.