ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవిత చరిత్ర గురించి ఆసక్తికర విషయాలను తెలుసుకోవాలని అందిరికీ ఉంటుంది. ఆయన బాల్యంలో ఎలా ఉండేవారో, ఏం చేసేవారో తెలుసుకోవాలని అనిపిస్తుంటుంది. ఇలాంటివారి కోరికను తీర్చే దిశగా మోదీ జీవిత చరిత్రపై ఇవాళ కొత్త పుస్తకం విడుదలైంది. మోదీ బాల్యానికి సంబంధించి అరుదైన ఛాయా చిత్రాలు, ఆయన గురించి ఎవ్వరికీ తెలియని విషయాలను ఈ పుస్తకంలో పొందుపరిచారు రచయితలు.
దేశ ప్రధానిగా మోదీ ఆరేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో.. "నరేంద్ర మోదీ - హార్బింగర్ ఆఫ్ ప్రాస్పెరిటీ అండ్ అపోస్టల్ ఆఫ్ వరల్డ్ పీస్" పేరుతో భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కే.జి. బాలక్రిష్ణన్ ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు.
లాక్డౌన్ కారణంగా పుస్తక ఆవిష్కరణ సామాజిక మాధ్యమాల ద్వారా జరిగింది. ఈ కార్యక్రమానికి భారత్, అమెరికాకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు.