వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా నిర్వహిస్తోన్న 'భారత్ బంద్'కు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మద్దతు తెలిపారు. ఈ బిల్లులతో రైతులను బానిసలుగా మారాల్సి వస్తుందని మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు.
"లోపభూయిష్ట జీఎస్టీతో ఎంఎస్ఎంఈలు నాశనమమయ్యాయి. ఇప్పుడు కొత్త వ్యవసాయ చట్టాలతో మన రైతులు బానిసలుగా మారతారు. అందుకే భారత్ బంద్కు మద్దతిస్తున్నా."
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత
ఈస్టిండియా కంపెనీ పాలనలా..
అంతకుముందు, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కూడా తన మద్దతు తెలిపారు.
"రైతుల నుంచి కనీస మద్దతు ధర లాక్కున్నారు. ఒప్పంద వ్యవసాయం ద్వారా కోటీశ్వరుల చేతుల్లో రైతులు బానిసలుగా మారతారు. వారికి సరైన ధరలే కాదు, గౌరవమూ లభించదు. సొంత పొలంలోనే రైతులు కూలీలుగా పనిచేయాల్సి వస్తుంది. భాజపా వ్యయసాయ బిల్లులు ఈస్టిండియా కంపెనీ పాలనను గుర్తుచేస్తున్నాయి. ఈ అన్యాయాన్ని మేం జరగనివ్వం."
- ప్రియాంక గాంధీ
పార్లమెంటు ఆమోదించిన 3 వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా అనేక రైతు సంఘాలు దేశవ్యాప్తంగా శుక్రవారం నిరసనలు, బంద్కు పిలుపునిచ్చాయి.
ఇదీ చూడండి:'రైతు సంక్షేమం కోసమే సంస్కరణలు'