గంటలపాటు పాముకు శస్త్రచికిత్స మనుషుల ప్రాణాలు కాపాడటం కోసం వైద్యులు గంటలపాటు శ్రమించి క్లిష్టమైన శస్త్ర చికిత్సలు చేయడం సాధారణం. కానీ బిహార్ రాజధాని పట్నాలో తొలిసారి పాముకు శస్త్ర చికిత్స చేశారు వైద్యులు. తీవ్రగాయాల పాలైన పామును ఎట్టకేలకు ప్రాణాలతో కాపాడారు. రెండు రోజుల పాటు పర్యవేక్షణలో ఉంచి.. కోలుకున్నాక అడవిలో వదిలారు.
పాముకు ఎక్స్‌రే
తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతున్న పామును ఓ స్వచ్ఛంద సంస్థకు చెందిన వ్యక్తి పట్నాలోని వెటర్నరీ ఆసుపత్రికి తీసుకొచ్చాడు. సర్పం తోక భాగం తీవ్రంగా దెబ్బ తిని ఉంది. వెంటనే ఎక్స్‌రే తీసిన వైద్యులు పాముకు మత్తుమందు ఇచ్చి రెండు గంటల పాటు శస్త్ర చికిత్సలు చేశారు. తోక భాగాన్ని తొలగించారు.
"తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న పామును ఎవరో ఆసుపత్రికి తీసుకొచ్చారు. . పామును అపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లాం. మత్తమందు, యాంటీ బయోటిక్, పెయిన్ కిల్లర్ ఇచ్చాం. తోకను తొలగించాం. అప్పటికీ పరిస్థితిలో మార్పులేదు. ఆక్సిజన్ థెరపీ చేసి, ఎమర్జేన్సీ డ్రగ్ ఇచ్చాక సాధారణ స్థితికి వచ్చింది. తొకలో 2శాతం భాగాన్ని మాత్రమే తిరిగి జతచేశాం."
-శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యురాలు.
చికిత్స అనంతరం పామును స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి తీసుకెళ్లాడు. రెండు రోజలు పర్యవేక్షించాడు. పాము కోలుకుందని తెలుసుకుని తిరిగి అడవిలో వదిలాడు.
ఇదీ చూడండి: సీఎం కాన్వాయ్‌ని బైక్‌తో ఢీకొట్టిన యువకుడు