తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సరిహద్దులో నేపాల్ రోడ్డు నిర్మాణం- అడ్డుకున్న భారత్ - Nepal started to construct road on no man's land

సరిహద్దులో మరో దుస్సాహసానికి పాల్పడింది నేపాల్. ఉత్తర్​ప్రదేశ్ పిలిభీత్ వద్ద ఇరుదేశాలు ఉపయోగించకూడని ప్రదేశంలో రహదారి నిర్మాణాన్ని ప్రారంభించింది. నేపాల్ ప్రయత్నాన్ని అడ్డుకుంది భారత్.

nepal
సరిహద్దులో నేపాల్ రహదారి నిర్మాణం.. అడ్డుకున్న భారత్

By

Published : Jul 6, 2020, 11:58 AM IST

పొరుగు దేశం నేపాల్ సరిహద్దులో మరో దుశ్చర్యకు పాల్పడింది. ఉత్తర్​ప్రదేశ్ పిలిభీత్​కు సమీపంలో... ఇరు దేశాలు ఉపయోగించకూడదని నిర్ణయించిన ప్రదేశంలో రహదారి నిర్మాణాన్ని ప్రారంభించింది. నేపాల్ ప్రయత్నాన్ని అడ్డుకుంది భారత్.

హజారా ప్రాంతంలోని కంపోజ్​నగర్ వద్ద పిల్లర్ నెంబర్లు 38, 39 మధ్య రోడ్డు నిర్మించే ఉద్దేశంతో పనులు ప్రారంభించింది నేపాల్. సమాచారం అందుకున్న పిలిభీత్ జిల్లా పాలనాధికారి వైభవ్ శ్రీవాత్సవ్... పోలీసులతో అక్కడకు చేరుకుని రహదారి పనులను నిలిపేశారు.

ఇదీ చూడండి:'మరోసారి మిడతల దండయాత్ర.. జర జాగ్రత్త'

For All Latest Updates

TAGGED:

PILIBHIT

ABOUT THE AUTHOR

...view details