భారత్-నేపాల్ సీనియర్ దౌత్యాధికారులు సోమవారం సమావేశమయ్యారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఈ ఉన్నతస్థాయి భేటీలో భారత్ సహాయంతో నేపాల్లో జరుగుతున్న అభివృద్ధి ప్రాజెక్టులను ఇరు దేశాల అధికారులు సమీక్షించారు. ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని నిర్ణయించారు. సరిహద్దు వెంబడి ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది.
నేపాల్ విదేశాంగ శాఖ సమాచారం ప్రకారం.. కాఠ్మాండూలోని భారత రాయబారి వినయ్ మోహన్, ఆ దేశ విదేశాంగ కార్యదర్శి శంకర్ దాస్ నేతృత్వంలో ఈ భేటీని నిర్వహించారు.
భూకంపం వల్ల గూర్ఖా, నువాకోట్ జిల్లాల్లో దెబ్బతిన్న 46,301 ఇళ్ల పునర్నిర్మాణం, మోతిహరి-అమ్లిఖ్గుంజ్ ప్రాంతంలో సరిహద్దు వెంబడి పెట్రోలియం ఉత్పత్తి పైప్లైన్ల పనితీరుపై ఇరు దేశాలు సమీక్ష నిర్వహించాయి.