కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఎన్ఈపీ 21వ శతాబ్దంలో విద్యారంగంలో కొత్త శకానికి నాంది పలికిందనిప్రధాని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. 2020 నూతన విద్యావిధానంలో పాఠశాల విద్యపై జరుగుతున్న సదస్సును ఉద్దేశించి ప్రసంగించారు ప్రధాని మోదీ. కొత్త విధానాన్ని సమర్ధవంతంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. పిల్లల నూతన విద్యాభ్యాసానికి 5 సూత్రాల మంత్రాన్ని సూచించారు.
" గత మూడు దశాబ్దాల్లో అనేక రంగాల్లో మార్పులు వచ్చినా విద్యా విధానంలో మాత్రం మార్పులు రాలేదు. పనిలో నిమగ్నం కావడం, శోధన, అనుభవం, భావ వ్యక్తీకరణ, ప్రతిభావంతులు కావటం అన్నవి పిల్లల నూతన విద్యాభ్యాసానికి మంత్రాలు అన్న విధానంలో ముందుకు సాగుతున్నాం. దేశ భవిష్యత్ నిర్మాణం యువతరం మీదే ఆధారపడి ఉంటుంది. అందులో వారి పాఠశాల విద్యది కీలక పాత్ర. అందుకే 2020-నూతన విద్యా విధానంలో ఈ అంశానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం."