తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎఫ్​సీఆర్​ఏ సవరణ బిల్లుకు లోక్​సభ ఆమోదం - విదేశీ విరాళాల చట్టం లోక్​సభ ఆమోదం

రిజిస్ట్రేషన్ సమయంలో ఎన్​జీఓ ఆఫీస్ బేరర్ల ఆధార్ సమర్పించడం తప్పనిసరి చేసే.. విదేశీ విరాళాల నియంత్రణ చట్ట సవరణ బిల్లుకు లోక్​సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ఏ మతానికి వ్యతిరేకం కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ స్పష్టం చేశారు.

FCRA Bill Passed In Parliament
ఎఫ్​సీఆర్​ఏ సవరణ బిల్లుకు లోక్​సభ ఆమోదం

By

Published : Sep 21, 2020, 10:45 PM IST

విదేశీ విరాళాల నియంత్రణ చట్ట(ఎఫ్​సీఆర్​ఏ) సవరణ బిల్లుకు.. లోక్​సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ఆమోదం ద్వారా ఎన్​జీఓ ఆఫీస్ బేరర్లు రిజిస్ట్రేషన్ సమయంలో ఆధార్ నెంబర్ సమర్పించడం తప్పనిసరి కానుంది.

బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా సభ్యుల ప్రశ్నలకు హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ సమాధానం ఇచ్చారు. ఈ బిల్లు ఏ ఒక్క ఎన్​జీఓకు, మతానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు.

"విదేశీ నిధులు దుర్వినియోగం కాకుండా ప్రతిపాదిత బిల్లు ఉపయోగపడుతుంది. ఆత్మనిర్భర్ భారత్​ సాధ్యమయ్యేందుకు ఇది చాలా అవసరం."

-నిత్యానంద రాయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి

ఎన్​జీఓలను అణచివేసేందుకే ఈ బిల్లును తీసుకొచ్చారని కాంగ్రెస్ ఎంపీ ఆంథోనీ ఆరోపించారు. అయితే దేశ వ్యతిరేక కార్యకలాపాల్లో పాల్గొనే ఎన్​జీఓలపై తప్పక చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఆధార్ తప్పనిసరి కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసినప్పుడు.. ఈ బిల్లు అవసరం ఏముందని తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సౌగతా రాయ్ పేర్కొన్నారు.

వైఎస్​ఆర్​సీపీ, శివసేన, జేడీయూ పార్టీలు ఈ బిల్లుకు మద్దతిచ్చాయి.

ABOUT THE AUTHOR

...view details