తెలంగాణ

telangana

ETV Bharat / bharat

హజారే డిమాండ్లను అంగీకరిస్తాం: ఫడణవిస్ - శివసేన

అన్ని డిమాండ్లను అంగీకరిస్తామని, దీక్షను విరమించాలని గాంధేయ వాది అన్నా హజారేను మహరాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్ విజ్ఞప్తి చేశారు.

అన్నా హజారే

By

Published : Feb 5, 2019, 6:55 AM IST

అన్నా హజారే
సామాజిక కార్యకర్త అన్నా హజారే డిమాండ్లను అంగీకరిస్తున్నట్లు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవిస్ సోమవారం ప్రకటించారు. లోకాయుక్త, లోక్​పాల్​లను ఏర్పాటు చేయాలని హజారే చేపట్టిన దీక్షను విరమించాలని ఆయన కోరారు. అవినీతి నిరోధక వ్యవస్థల ఏర్పాటులో ప్రభుత్వాల అలసత్వంపై నిరసనగా అన్నా చేస్తున్న ఆమరణ నిరాహార దీక్ష మంగళవారంతో ఆరు రోజులకు చేరుకుంది.

ప్రభుత్వాలు స్పందించకపోతే పద్మ భూషన్​ను తిరిగి ఇచ్చేస్తానంటూ హజారే సోమవారం హెచ్చరించారు. హజారేను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని శివసేనతో పాటు పలు విపక్షాలు కోరాయి. అన్నా డిమాండ్లను అంగీకరిస్తామని, దీనికి సంబంధించి హజారేకు లేఖ కూడా రాశామని ఫడణవిస్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details