తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఘనంగా 'పద్మ' అవార్డుల ప్రదానోత్సవం

రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ దిల్లీలోని రాష్ట్రపతి భవన్​లో 56 మందికి పద్మ పురస్కారాలను ప్రదానం చేశారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి రాజ్​నాథ్​ సింగ్​ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

2019-పద్మ అవార్డులు

By

Published : Mar 11, 2019, 6:37 AM IST

Updated : Mar 11, 2019, 2:53 PM IST

ఘనంగా 'పద్మ' అవార్డుల ప్రదానోత్సవం
దిల్లీలోని రాష్ట్రపతి భవన్​లో 2019-పద్మ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగాజరగింది. ఇందులో భాగంగా మొత్తం 112 మంది విజేతల్లో 56 మందికి రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ పురస్కారాలు అందించారు. ప్రభుదేవా (పద్మశ్రీ), మోహన్​లాల్ (పద్మ భూషణ్​)​, శివమణి (పద్మశ్రీ),కేదార్​ఖాన్​ (పద్మశ్రీ), సుఖ్​దేవ్​ సింగ్​ దింద్షా (పద్మభూషణ్​), కుల్దీప్​ నయ్యర్ ​(పద్మభూషణ్​), బాబాసాహెబ్​ పురందరే (పద్మవిభూషణ్​), హుకుందేవ్​ నారాయణ్​ యాదవ్​ (పద్మ భూషణ్​), జాన్​ ఛాంబర్స్​ (పద్మశ్రీ) తో పాటు మరికొందరు పురస్కారాలు అందుకున్నారు.

ప్రధాని హాజరు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి రాజ్​నాథ్​ సింగ్​ సహా మరికొందరు కేంద్రమంత్రులుఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

16న మరో కార్యక్రమం

మిగతా వారికి ఈ నెల 16న జరిగే తదుపరి కార్యక్రమంలో పురస్కారాలు అందించనున్నారు.

ఈ ఏడాది రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 25న 112 మందితో పద్మ అవార్డుల జాబితాను ప్రకటించింది కేంద్రం. అందులో నలుగురికి పద్మ విభూషణ్, 14 మందికి పద్మభూషణ్, 94 మందికి పద్మశ్రీ పురస్కారాలు దక్కాయి.

Last Updated : Mar 11, 2019, 2:53 PM IST

ABOUT THE AUTHOR

...view details