తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మీలా మేం ఉండుంటే.. ఏదీ జరిగేది కాదు: మోదీ - నరేంద్ర మోదీ

విపక్ష కాంగ్రెస్సే లక్ష్యంగా ప్రధాని మోదీ మరోమారు విమర్శనాస్త్రాలను సంధించారు. కాంగ్రెస్​ అనుసరించిన ఆలోచనలు, పద్ధతులను భాజపా కూడా పాటించి ఉంటే.. దేశంలో ఏళ్లుగా ఉన్న సమస్యలకు ఇప్పటికీ పరిష్కారం దొరికేది కాదని పేర్కొన్నారు.

nda-govts-determination-solved-many-problems-modi
మీలా మేము ఉండుంటే.. ఏదీ జరిగేది కాదు: మోదీ

By

Published : Feb 6, 2020, 1:34 PM IST

Updated : Feb 29, 2020, 9:44 AM IST

లోక్​సభ వేదికగా కాంగ్రెస్​పై విరుచుకుపడ్డారుప్రధానమంత్రి నరేంద్ర మోదీ. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంలో.. ఓవైపు హస్తం పార్టీపై ఆరోపణలు చేస్తూనే.. భాజపా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించారు. తమ సంకల్పం, సంచలన నిర్ణయాలతోనే ఎన్నో ఏళ్లుగా ఉన్న సమస్యలు పరిష్కారమయ్యాయని పేర్కొన్నారు మోదీ.

మీలా మేము ఉండుంటే.. ఏదీ జరిగేది కాదు: మోదీ

"మీరు అనుసరించిన పద్ధతులను మేమూ అనుసరించి ఉంటే, మీరు నడిచిన మార్గంలోనే మేమూ నడిచి ఉంటే.. 70ఏళ్ల తర్వాత కూడా ఆర్టికల్​ 370 రద్దు జరిగి ఉండేది కాదు. మీ ఆలోచనా విధానాలతోనే మేమూ ముందుకు వెళ్లుంటే.. 'ముమ్మారు తలాక్​' కత్తి నుంచి ముస్లిం మహిళలకు ఉపశమనం లభించేది కాదు. మీరు నడిచిన మార్గంలోనే మేమూ నడిచి ఉంటే... అత్యాచారం చేసిన వారికి ఉరిశిక్ష పడేలా చట్టం వచ్చేది కాదు. మీ ఆలోచనలతోనే నడిచి ఉంటే.. రామ​ జన్మభూమి ఇప్పటికీ వివాదాల్లోనే ఉండేది. మీలాగే మేమూ ఆలోచించి ఉంటే.. కర్తార్​పుర్​ నడవా వచ్చేదే కాదు. మీరు ఎంచుకున్న పద్ధతులనే మేమూ అనుసరించి ఉంటే భారత్​-బంగ్లాదేశ్​ మధ్య సరిహద్దు వివాదానికి పరిష్కారం దక్కేది కాదు."

--- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

ఐదేళ్లపాటు తమ పనితనాన్ని చూసిన ప్రజలు.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి భాజపాకు భారీ స్థాయిలో మద్దతు పలికారన్నారు మోదీ.

Last Updated : Feb 29, 2020, 9:44 AM IST

ABOUT THE AUTHOR

...view details