2018లో దేశవ్యాప్తంగా జరిగిన అత్యాచారాల్లో ప్రతి నలుగురు బాధితుల్లో ఒకరు మైనరేనని 'నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో' నివేదిక వెల్లడించింది. 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న మహిళలపైనే 50 శాతానికిపైగా అత్యాచారాలు జరిగాయని ఈ నివేదిక స్పష్టం చేసింది.
బంధువుల చేతిలోనే
అత్యాచార కేసుల్లో దాదాపు 94 శాతం మంది నిందితులు... బాధితుల కుటుంబ సభ్యులు, స్నేహితులు, తెలిసిన వారేనని ఈ నివేదిక వెల్లడించింది. 2017 లో 32 వేల 559 అత్యాచార కేసులు నమోదయ్యాయని ఎన్‌సీఆర్‌బీ తెలిపింది. కాగా 2018లో ఈ సంఖ్య 33 వేల 356కు చేరుకుందని పేర్కొంది. 2018లో దేశంలో రోజుకు సగటున 89 అత్యాచారాలు జరిగాయని నివేదిక బహిర్గతం చేసింది.