తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఎమ్మెల్యే హత్య ఘటన సూత్రధారి హతం - సుఖ్మా

ఛత్తీస్​గఢ్​కు చెందిన భాజపా ఎమ్మెల్యే భీమా మండావీ హత్య ఘటన వెనుక ప్రధాన సూత్రధారి అయిన మావోయిస్టును పోలీసులు హతమార్చారు.

ఎమ్మెల్యే హత్య ఘటన సూత్రధారి హతం

By

Published : May 3, 2019, 12:08 AM IST

దంతెవాడ ఎమ్మెల్యే, భాజపా నేత భీమా మండావీ హత్య ఘటన ప్రధాన సూత్రధారి అయిన మాడ్వీ ముయ్య అనే మావోయిస్టును భద్రతా దళాలు ఛత్తీస్​గఢ్​లో హతమార్చాయి. మాడ్వీ ముయ్య (29) అలియాస్​ జోగ కుంజమ్​పై రూ.8 లక్షల నగదు రివార్డు ఉంది.

ఛత్తీస్​గఢ్​లోని రాయ్​పుర్​కు 450 కిలోమీటర్ల దూరంలో అటవీ ప్రాంతంలోని గ్రామాల్లో భద్రతా బలగాలు తనిఖీలకు వెళ్లిన సమయంలో మావోయిస్టులు కాల్పులకు తెగబడ్డట్లు యాంటీ నక్సల్స్​ డైరెక్టర్​ జనరల్​ గిరిధరి నాయక్​ తెలిపారు. భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. అనంతరం కాల్పుల్లో హతమైన మావోయిస్టు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

2017 ఏప్రిల్​ 24న

సుఖ్మా జిల్లాలో జరిగిన బుర్కాపాల్​ దాడిలోనూ కుంజమ్​ హస్తముంది. ఈ దాడిలో 25 మంది భద్రతా సిబ్బంది అమరులయ్యారు.

ఇదీ చూడండి: మసూద్​ అంశంపై ఆగని మాటల మంటలు

ABOUT THE AUTHOR

...view details