తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మావోల దాడిలో ఎమ్మెల్యే సహా నలుగురు మృతి - MLA

ఛత్తీస్​గడ్​లోని దంతెవాడ జిల్లాలో జరిగిన మావోయిస్టుల దాడిలో ఓ భాజపా ఎమ్మెల్యే సహా నలుగురు భద్రతా సిబ్బంది మృతి చెందారు. వీరి మృతిపై ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి రాజ్​నాథ్​ సింగ్​ ఘటన వివరాలపై ఆరా తీశారు.

భాజపా ఎమ్మెల్యేను బలిగొన్న నక్సలైట్లు

By

Published : Apr 9, 2019, 6:27 PM IST

Updated : Apr 9, 2019, 11:53 PM IST

మావోల దాడిలో ఎమ్మెల్యే సహా నలుగురు మృతి

ఛత్తీస్​గడ్​లో మావోలు మరోసారి పంజా విసిరారు. ప్రచారానికి వెళ్తున్న భాజపా ఎమ్మెల్యే భీమా మండావి వాహన శ్రేణి లక్ష్యంగా మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే సహా మరో నలుగురు జవాన్లు అక్కడికక్కడే మృతి చెందారు.

బచెలీ ప్రాంతం నుంచి కువాకొండకు వెళ్తున్న భీమా మండావి వాహనంపై శ్యామగిరి-కువాకుంట మధ్యలో దాడి చేశారు మావోయిస్టులు. మందుపాతర పేల్చి తుపాకులతో కాల్పులు జరిపారు. ఘటనపై ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ యాంటీ నక్సల్స్ డీజీతో ఆరా తీశారు.

నక్సల్స్​ ప్రభావిత ప్రాంతమైన దంతెవాడ, బస్తర్​ లోక్​సభ నియోజకవర్గం కిందికి వస్తుంది. రెండు రోజుల్లో ఎన్నికలు ఉన్న కారణంగా 80వేలమంది భద్రతా సిబ్బందిని బస్తర్​లో మోహరించారు అధికారులు.

ఈ విషయమై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడానని, దంతెవాడకు వెళ్లి మృతుల కుటుంబాలను పరమార్శించనున్నట్లు మాజీ సీఎం రమణ్​సింగ్ వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర హోంమంత్రి రాజ్​నాథ్​ సింగ్ ప్రస్తుత పరిస్థితులపై సీఎంను అడిగి తెలుసుకున్నారు.

రాష్ట్ర ఎన్నికల అధికారి జిల్లా యంత్రాంగాన్ని అలర్ట్​ చేశారు. పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. తొలి విడత ఎన్నికలు జరగబోయే జిల్లాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు

2013 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇలాంటి దుశ్చర్యకే పాల్పడ్డారు మావోలు. కాంగ్రెస్ పార్టీ నేతలే లక్ష్యంగా మందుపాతర పేల్చారు. ఆ ఘటనలో కాంగ్రెస్ నేతలు వీసీ శుక్లా, మహేంద్ర కర్మ సహా 27మంది అసువులు బాశారు.

Last Updated : Apr 9, 2019, 11:53 PM IST

ABOUT THE AUTHOR

...view details