తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఐదుగురు జవాన్లను బలిగొన్న మావోలు - naxals

ఝార్ఖండ్​  సరాయ్​కెలా జిల్లా కుక​డులో ఐదుగురు పోలీసులను దారుణంగా హత్య చేశారు మావోయిస్టులు. గస్తీ విధులు నిర్వహిస్తున్న వారిపై కిరాతకంగా కాల్పులు జరిపారు.

జార్ఖండ్​లో మవోల ఘాతుకం

By

Published : Jun 14, 2019, 8:44 PM IST

Updated : Jun 15, 2019, 12:06 AM IST

ఐదుగురు జవాన్లను బలిగొన్న మావోలు

ఝార్ఖండ్​లో మావోయిస్టులు ఘాతుకానికి పాల్పడ్డారు. సరాయ్​కెలా జిల్లా కుకడు మార్కెట్​ సమీపంలో గస్తీ విధులు నిర్వహిస్తున్న జవాన్లపై తుపాకులతో కిరాతకంగా కాల్పులు జరిపారు. ఘటనలో ఐదుగురు పోలీసులు మరణించారు. మరొకరు గాయపడ్డారు. మృతి చెందిన వారిలో ఇద్దరు ఏఎస్​ఐలు, ముగ్గురు కానిస్టేబుళ్లు ఉన్నారు.

ఇద్దరు మావోయిస్టులు ఘటనలో పాల్గొన్నట్లు సమాచారం. ఘటనా స్థలం నుంచి పోలీసుల ఆయుధాలను తీసుకెళ్లారు.

Last Updated : Jun 15, 2019, 12:06 AM IST

ABOUT THE AUTHOR

...view details