ఝార్ఖండ్లో భద్రతా సిబ్బంది లక్ష్యంగా నక్సల్స్మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో 15 మంది జవాన్లకు గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన నలుగురిని హెలికాప్టర్లో రాంచీకి తరలించారు. సరాయికేలా కర్సవాన్ జిల్లాలోని హుర్దా అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ ప్రత్యేక దళం కోబ్రా, స్థానిక పోలీసులు కూంబింగ్ చేపట్టారు.ఈ బృందం లక్ష్యంగా ఉదయం 5 గంటల ప్రాంతంలో మందుపాతర పేల్చారు నక్సల్స్.
ఐఈడీ పేలుడులో 15మంది జవాన్లకు గాయాలు
ఝార్ఖండ్లో భద్రతా సిబ్బంది లక్ష్యంగా మందుపాతర పేల్చారు నక్సల్స్. ఈ ఘటనలో 15 మంది భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి.
నక్సల్స్ బాంబు దాడిలో 11మంది కి గాయాలు
గాయపడిన వారిలో 13 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది, మరో ఇద్దరు రాష్ట్ర పోలీసు విభాగానికి చెందిన వారున్నారు.
భద్రతా దళాలు ఘటనా స్థలిని అధీనంలోకి తీసుకున్నాయి. నక్సల్స్ వేట కొనసాగుతోందని అధికారులు తెలిపారు. దోషులను శిక్షిస్తామన్నారు.
Last Updated : May 28, 2019, 11:59 AM IST