తెలంగాణ

telangana

ETV Bharat / bharat

51 గంటలు డ్రమ్స్ కొట్టి.. ఒక్కటైన ప్రేమ జంట - నాసిక్​లో 51 గంటల పాటు సంగీత విభావరి

మహారాష్ట్ర నాసిక్​లో ఓ ప్రేమ జంట వినూత్న రీతిలో వివాహం చేసుకుంది. వధూవరులు స్వయంగా డ్రమ్స్ వాయిస్తూ 51 గంటలపాటు సంగీత విభావరి నిర్వహించి, ఆ తరువాత మూడు ముళ్లతో ఒక్కటయ్యారు.

Nashik- Famous MH 51 band drummer Vinesh Nair beats the drum for continuous 51 hrs and after that get married.
సంగీత విభావరితో ఒక్కటైన జంట

By

Published : Jun 13, 2020, 1:08 PM IST

51 గంటలు డ్రమ్స్ కొట్టి.. తాళి కట్టిన వరుడు

కరోనా సంక్షోభం కొనసాగుతున్న వేళ.. మహారాష్ట్ర నాసిక్​లోని ఓ ప్రేమ జంట లాక్​డౌన్ నిబంధనలు పాటిస్తూ వినూత్న రీతిలో వివాహం చేసుకుంది. స్వయంగా వధూవరులు డ్రమ్స్ వాయిస్తూ 51గంటల పాటు నిర్విరామంగా సంగీత విభావరి నిర్వహించి, ఆ తరువాత వివాహం చేసుకున్నారు.

నాసిక్​కు చెందిన ప్రముఖ 'ఎంహెచ్​ 51 మ్యూజికల్​ బ్యాండ్'లో వినేశ్ నాయర్ డ్రమ్మర్​గా పనిచేస్తున్నాడు. స్థానికంగా అతనికి మంచి డ్రమ్మర్​గా గుర్తింపు ఉంది. అతనికి ప్రియాంక క్షత్రియాతో వివాహం కుదిరింది. అయితే కరోనా సంక్షోభం, లాక్​డౌన్​ నిబంధనల వల్ల తమ వివాహాన్ని కొద్ది మంది అతిథులతో సాధారణంగా జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు.

మరపురాని వేడుక

ఎంహెచ్​ 51 బ్యాండ్ సభ్యులు మాత్రం తమ స్నేహితుడి వివాహ వేడుకను ప్రత్యేకంగా నిలపాలని నిర్ణయించుకున్నారు. నిర్విరామంగా 51 గంటలపాటు అద్భుత రీతిలో సంగీత విభావరి నిర్వహించారు. ఈ సంగీత కార్యక్రమంలో వధూవరులు కూడా స్వయంగా డ్రమ్స్ వాయించారు. ఆ తరువాతే మూడు ముళ్లతో ఒక్కటయ్యారు. వేడుకకు హాజరైన వారందరూ మాస్కులు ధరించి, డ్రమ్స్​ పట్టుకుని పాటలు పాడారు.

సంగీత విభావరిలో ప్రముఖ గాయకుడు రాహుల్ అంబేకర్, సంగీతకారుడు-నటుడు గణేష్ జాదవ్ ఆహూతులందరినీ ఆలరించారు. పెళ్లి వేడుకలకు హాజరైన వారు కూడా డ్రమ్స్ వాయిస్తూ వధూవరులకు మరపురాని తీపి జ్ఞాపకాలను అందించారు.

ఇదీ చూడండి:'ఈ పామే నన్ను కాటేసింది డాక్టర్​ గారూ!'

ABOUT THE AUTHOR

...view details