భాజపా దివంగత నాయకురాలు, కేంద్ర మాజీమంత్రి సుష్మా స్వరాజ్‌ను గుర్తు చేసుకొని భావోద్వేగానికి లోనయ్యారు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు. రక్షా బంధన్ రోజు తన సోదరి లేని లోటు తెలుస్తోందని ట్వీట్ చేశారు. గతంలో ఆమె రాఖీ కట్టిన ఫొటోను షేర్ చేశారు.
వెంకయ్య షేర్ చేసిన ఫొటోను సుష్మా స్వరాజ్ కూతురు బాంసురి స్వరాజ్ కూడా పోస్ట్ చేశారు. ఒక తీపి జ్ఞాపకమని అన్నారు.