పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన యుద్ధ ట్యాంకు విధ్వంసక క్షిపణి నాగ్‌ను భారత సైన్యం విజయవంతంగా పరీక్షించింది. పోఖ్రాన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్లో జులై 7 నుంచి 18 మధ్య సైన్యం జరిపిన వరుస పరీక్షల్లో నాగ్ విజయం సాధించింది.
నాగ్ క్షిపణి ప్రయోగం విజయవంతం - డీఆర్డీఓ
యుద్ధ ట్యాంకు విధ్వంసక క్షిపణి నాగ్‌ను భారత సైన్యం విజయవంతంగా పరీక్షించింది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన నాగ్‌ను పోఖ్రాన్లో పరీక్షించారు.
నాగ్ క్షిపణి
భారత రక్షణ పరిశోధన సంస్థ (డీఆర్డీఓ) దేశీయంగా అభివృద్ధి చేసిన యాంటీ ట్యాంక్ గైడెడ్ క్షిపణుల్లోనాగ్... 3వ తరానికి చెందింది. 7 నుంచి 10 కిలోమీటర్ల పరిధిలోని శత్రు యుద్ధ ట్యాంకులను ధ్వంసం చేసే సామర్థ్యం ఉన్న నాగ్ 8 కేజీల పేలోడ్‌ను మోసుకెళ్లగలదు.
ఇదీ చూడండి: చంద్రయాన్-2 సిద్ధం... ఈ నెల 22న ప్రయోగం