తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఆర్​ఎస్ఎస్​ భేటీలో 370 రద్దు, ఎన్​ఆర్​సీపై చర్చ - భాజపా

జమ్ముకశ్మీర్​లో ఆర్టికల్​ 370 రద్దు అంశంపై ఆర్​ఎస్​ఎస్​ శ్రేణులకు వివరించారు భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా. అసోం జాతీయ పౌర జాబితాపై భాజపా సీనియర్​ నేత రాంమాధవ్ సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.

370 రద్దు, ఎన్​ఆర్​సీపై ఆర్​ఎస్ఎస్​ సమావేశంలో చర్చ

By

Published : Sep 8, 2019, 8:54 PM IST

Updated : Sep 29, 2019, 10:19 PM IST

ఆర్​ఎస్ఎస్​ భేటీలో 370 రద్దు, ఎన్​ఆర్​సీపై చర్చ

జమ్ముకశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు అంశంపై ఆర్​ఎస్ఎస్ శ్రేణులకు వివరంగా చెప్పారు భాజపా జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా.

'సీమ జాగరణ్ మంచ్' పేరిట జరుగుతున్న సమావేశంలో ఆర్టికల్ 370 రద్దు, తదనంతర పరిణామాల గురించి సంఘ్ నేతలకు, ఆర్​ఎస్​ఎస్​ అనుబంధ సంఘాలకు నడ్డా వివరించినట్లు తెలుస్తోంది. కశ్మీర్‌లోయలో పరిస్థితులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తీసుకోనున్న చర్యలనూ సవివరంగా చెప్పినట్లు సమాచారం.

అసోంలో ఇటీవల విడుదల చేసిన జాతీయ పౌర జాబితాపై భాజపా సీనియర్ నేత రామ్‌ మాధవ్.. సంఘ్ నేతల ఎదుట అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. అర్హులైన వారిలో చాలా మందికి జాబితాలో చోటుదక్కలేదని, అనేకమంది హిందువులకు అన్యాయం జరిగిందని చెప్పినట్లు తెలుస్తోంది.

మూడు రోజుల పాటు జరగనున్న ఈ సమావేశాలు రాజస్థాన్ పుష్కర్​లో శనివారం ప్రారంభమయ్యాయి. ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంస్థలకు చెందిన సుమారు 200 మంది ప్రతినిధులు ఈ భేటీకి హాజరవుతున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ నుంచి జాతీయ భద్రత వరకూ సమావేశంలో చర్చించనున్నారు.

ఇదీ చూడండి: 'మోదీ 2.0: వంద రోజుల దౌర్జన్యం, గందరగోళం, అరాచకం'

Last Updated : Sep 29, 2019, 10:19 PM IST

ABOUT THE AUTHOR

...view details