ఎందరో అభిమానులు ప్రజాప్రతినిధులకు శుభలేఖలిస్తారు. కొందరు తేదీ గుర్తుపెట్టుకుని పెళ్లికి హాజరవుతారు. మరికొందరికి వీలుకాకపోవచ్చు. అయితే ఆ శుభలేఖలను ఎక్కడో పెట్టి మరచిపోతారు. కేరళ ఎర్నాకుళంలోని మువట్టుపుళ నియోజకవర్గ శాసన సభ్యుడు ఎల్డో అబ్రహం ఇందుకు పూర్తి భిన్నం.
'నాకు శుభలేఖలు పంపినవారంతా నా పెళ్లికి రావాలి' - 'నాకు శుభలేఖలు పంపినవారంతా నా పెళ్లికి రావాలి'
కొంత మందికి జ్ఞాపకాలు సేకరించడమంటే మహా ఇష్టం.. అయితే పురాతన నాణేలు, స్టాంపులు, కరెన్సీ నోట్లను సేకరించి వాటిని భద్రంగా దాచుకునేవారు చాలామందే ఉన్నారు. కానీ కేరళకు చెందిన ఓ శాసనసభ్యుడు 25 ఏళ్లుగా 4578 శుభలేఖలను దాచుకున్నాడు. ఎందుకో తెలుసా?
25 ఏళ్లుగా 4,578 పెళ్లి పత్రికలను భద్రంగా దాచుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. వారందరీ చిరునామాలను ప్రత్యేకంగా రాసుకున్నారు అబ్రహం. తనకు శుభలేఖ ఇచ్చి పెళ్లికి ఆహ్వానించిన వారందరినీ తన వివాహానికి తప్పకుండా పిలవాలని 25 ఏళ్ల క్రితమే నిశ్చయించుకున్నారాయన.
వచ్చే ఏడాది జనవరి 12న స్థానిక చర్చిలో ఆయుర్వేద వైద్యురాలు ఆగీ మేరీ అగస్టీన్ను ఆయన వివాహమాడనున్నారు. తన పెళ్లికి నియోజకవర్గంలోని ప్రజలందరినీ ఆహ్వానించారు. వీరితోపాటు ఆయన సేకరించిన శుభలేఖల్లోని అన్ని చిరునామాలకూ ఆహ్వానం పంపుతున్నారీ ఎమ్మెల్యే.
ఇదీ చదవండి:చెరుకుతోటలో రెండు అందమైన చిరుత పిల్లలు