మసూద్ అజర్ నేతృత్వంలోని జైషే మహ్మద్ తన హయాంలో రెండుసార్లు భారత్ పై దాడులకు పాల్పడిందని పాక్ మాజీ అధ్యక్షుడు ముషారఫ్ తెలిపారు. అందుకోసం ఇంటలిజెన్స్ సంస్థలను ఉపయోగించుకుందని ఆరోపించారు.
జేఈఎంపై పాకిస్థాన్ నిషేధం విధించడం మంచి పరిణామమని.. తన హయాంలోనే తననే రెండుసార్లు హత్య చేయాడానికి ఈ ఉగ్రసంస్థ ప్రయత్నించిందని తెలిపారు.
మసూద్ పాక్ లోనే ఉన్నాడని.. కానీ అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేమని, భారత్ ఒకవేళ పటిష్టమైన ఆధారాలు చూపిస్తే చర్యలు తీసుకోవడానికి సిద్ధమని గత నెల పాక్ విదేశాంగ మంత్రి ఓ ప్రకటనలో తెలిపారు.