తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​ భేరి: మనసులో మాట బొమ్మగా మారితే! - మునావర్

ప్రధాని నరేంద్రమోదీపై ఉన్న అభిమానాన్ని కళాత్మకంగా చాటుకున్నారు గుజరాత్​కు చెందిన మునావర్ షేక్. ప్రధాని జీవితంలోని ముఖ్య ఘట్టాలను పెయింటింగ్స్​గా వేశారు.

మోదీ చిత్రాలు

By

Published : Mar 27, 2019, 8:22 AM IST

Updated : Mar 27, 2019, 10:42 AM IST

మునావర్ చిత్రాల్లో మోదీ అంతర్మథనం
"ప్రధాని నరేంద్రమోదీ ఆకాశవాణిలో 'మనసులో మాట' చెబుతారు. నేను ఆయన మనసులో మాటను చెబుతా" అంటున్నారు కళాకారుడు మునావర్ షేక్. ఈయనది గుజరాత్​లోని అహ్మదాబాద్​. మోదీకి మునావర్ వీరాభిమాని. నరేంద్రుడి దేశభక్తికి ఫిదా అయ్యానని చెబుతారాయన.

"మోదీ సాదాసీదాగా ఉంటారు. పేద కుటుంబం నుంచి వచ్చారు. దేశం గురించి ఆయన ఆలోచనలు నన్ను ప్రభావితం చేశాయి. ఆయన కఠిన హిందుత్వవాదేమీ కాదు. 2002 అల్లర్ల గురించి మాట్లాడాలంటే... ఆ విషయం మరిచిపోవటం మంచిది. నేను ఓ డ్రైవర్​. నేను వెనుక చూసి వాహనాన్ని నడపలేను కదా. సమస్యలను ఎదుర్కొంటేనే మనిషిగా ఎదుగుతారు. మోదీని ముస్లింలు ద్వేషిస్తారనేది అబద్ధం. ఆయన ఏం చేసినా దేశం కోసమే చేస్తారు. మోదీ ఎలానో ముస్లింలు కూడా దేశభక్తులే."
- మునావర్ షేక్, కళాకారుడు

ఇదీ చూడండి:మోదీపై పోటీకి ముఖ్యమంత్రి తండ్రి సై!

మోదీ చేసే ప్రతి కార్యక్రమాన్ని క్షుణ్నంగా పరిశీలిస్తారు మునావర్. ముఖ్య ఘట్టాలను చిత్రాలుగా మలుస్తున్నారు. సందర్భానికి తగిన హావభావాలు స్పష్టంగా కనిపించేలా వాటిని రూపొందిస్తారు. బొమ్మలతోపాటే వర్తమాన పరిస్థితులను పద్యాల రూపంలో వివరించడం మునావర్ ప్రత్యేకత.

"మోదీని విపక్షాలు అహంకారి అంటాయి. అది దుర్గుణమని ఆయన కూడా నమ్ముతారు. కానీ దేశ సమగ్రత, ఐక్యత, అభివృద్ధికి దాన్ని ఉపయోగించాలంటారు మోదీ. దీన్ని దేశాభిమానంగానే భావిస్తాను. అహంకారంగా కాదు."
- మునావర్ షేక్, కళాకారుడు

మోదీ వ్యక్తిత్వాన్ని పూర్తిగా చదివానని, అందుకే ఆయనంటే అంత అభిమానమని చెబుతున్నారు మునావర్. కఠిన నిర్ణయాలు తీసుకోవటంలో మోదీ దిట్ట అని కితాబిస్తున్నారు.

"జాతిపితగా మహాత్మ గాంధీని పిలుస్తాం... సర్దార్​ వల్లభ్​భాయ్ పటేల్ జాతికి పుత్రుడు. దేశ క్షేమం కోసం పటేల్​ తరహా కఠిన నిర్ణయాలు మోదీ మాత్రమే తీసుకోగలరు."
-మునావర్ షేక్, కళాకారుడు

మరిన్ని:

Last Updated : Mar 27, 2019, 10:42 AM IST

ABOUT THE AUTHOR

...view details