దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ఆంక్షల వల్ల నష్టపోతున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు సత్వరం చర్యలు చేపట్టాలని ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వానికి పలు సూచనలు చేస్తూ ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
రైతులను ఆదుకునేందుకు కేంద్రానికి స్వామినాథన్ సూచనలు - లాక్‌డౌన్
లాక్‌డౌన్ కారణంగా రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త, ప్రొఫెసర్ ఎంఎస్ స్వామినాథన్ వారిని ఆదుకోవాలని కోరుతూ కేంద్రానికి కొన్ని సూచనలు చేశారు.
MS Swaminathan's reference to the center
స్వామినాథన్ సూచనలు..
- పంటల గిట్టుబాటు ధర కోసం 'మార్కెట్ జోక్యం' పథకాన్ని ప్రవేశపెట్టాలి. రైతులకు కలిగే నష్టాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా భరించాలి.
- కూలీల రవాణాకు స్థానికంగా అనుమతులివ్వాలి.
- యంత్ర పరికరాల అందుబాటుకు ప్రభుత్వాలు ప్రాధాన్యమివ్వాలి.
- రబీపంటల సేకరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భరోసా కల్పించాలి.
- రైతులు ఖరీఫ్‌కు సిద్ధమయ్యేందుకు.. పాత బాకీలతో సంబంధం లేకుండా కొత్త రుణాలివ్వాలి.
- వ్యాపారుల నుంచి అప్పు తీసుకున్న రైతులకు రక్షణ కల్పించాలి. వచ్చే పంట వరకూ రైతుల నుంచి వడ్డీ వసూలు చేయకుండా వ్యాపారులను ఆదేశించాలి.
- ‘పీఎం కిసాన్’ కింద రైతులకు ఇప్పుడిస్తున్న రూ.6 వేలను రూ.15 వేలకు పెంచి, తక్షణం అందులో సగం మొత్తాన్ని వారి ఖాతాలో జమచేయాలి.
- రైతు ఉత్పత్తి సంఘాలను క్రియాశీలం చేయాలి.
- పంట కోతలు, నూర్పిళ్లకయ్యే ఖర్చులను 'గ్రామీణ ఉపాధి హామీ పథకం' కింద చెల్లించాలి.
- పూర్తిస్థాయిలో మార్కెట్లు అందుబాటులోకి వచ్చే వరకు.. పంటల నిల్వకు శీతల గిడ్డంగులు, ఇతర గోదాములను అందుబాటులో ఉంచాలి. పాల విషయంలో ప్రస్తుతం ‘నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు (ఎన్‌డీడీబీ)’ వ్యవహరిస్తున్నట్టుగా, ఉద్యానవన పంటల విషయంలో ‘నేషనల్ హార్టికల్చర్ డెవలప్‌మెంట్ బోర్డు (ఎన్‌హెచ్‌డీబీ) చర్యలు చేపట్టాలి.
- ఖరీఫ్ నాటికి విత్తనాలను అందుబాటులో ఉంచాలి.
- సేద్యంలో మహిళల భాగస్వామ్యాన్ని గుర్తించి వారికి సాంకేతిక, ఆర్థిక సాధికారత కల్పించాలి.
- రైతులకు పంట ఉత్పత్తులకు విలువ జోడించే (ప్రాసెసింగ్) యంత్రాలను అందించాలి.