భారత పార్లమెంటు సభ్యులు ఆర్మీ వాహనాలపై అమితాసక్తి ప్రదర్శిస్తున్నారు. భద్రతా దళాలు పూర్తిగా వినియోగించి, పక్కన పెట్టేసిన వాహనాల కోసం వీరి నుంచి దరఖాస్తులు పెరిగిపోతున్నాయి. 2017,18లలో ఆ వాహనాల కోసం దాదాపు 36 మంది పార్లమెంటు సభ్యులు దరఖాస్తు చేసుకున్నారంటేనే అర్థమవుతోంది.
దీనికి సంబంధించిన సమాచారాన్ని.. కేంద్ర మంత్రి శ్రీపాద నాయక్ రాజ్యసభలో మంగళవారం లిఖితపూర్వకంగా వెల్లడించారు.
పూర్తిగా వినియోగించిన వాహనాలు తక్కువ ధరకు లభిస్తున్న కారణంతో.. ఎంపీలు వీటి కొనుగోలుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇందులో ఎక్కువగా మారుతీ జిప్సీ, మహీంద్రా జీపులు, రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్లు ఉన్నాయి.